తాడేపల్లిగూడెం రూరల్: దాళ్వా సీజన్‌కు కోరమండల్ ఫెర్టిలైజర్స్ కంపెనీకి చెందిన 2,670 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని జిల్లా వ్యవసాయాధికారి జెడ్.వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం స్థానిక రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఎరువుల ర్యాక్‌లను ఏడీఏతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా దాళ్వా సీజన్‌కు 2.25 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందన్నారు. యూరియా 6921 మెట్రిక్ టన్నులు, డీఏపీ 1332 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 1847 మెట్రిక్ టన్నులు, ఎన్‌పీకే 8378 మెట్రిక్ టన్నులు అవసరమని తెలిపారు. హోల్‌సేల్ వ్యాపారులు, రిటైల్ వ్యాపారులు, సొసైటీలు, రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment