బరులకు బేరం | - | Sakshi
Sakshi News home page

బరులకు బేరం

Published Wed, Jan 8 2025 1:41 AM | Last Updated on Wed, Jan 8 2025 1:41 AM

బరులక

బరులకు బేరం

వైభవంగా సింహాసన ఉత్సవం
జంగారెడ్డిగూడెం: పారిజాత గిరి వేంకటేశ్వరటేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం గోదా రంగనాథ ఉత్సవ మూర్తులకు సింహాసన ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
సంక్రాంతి కోడిపందేలకు పశ్చిమగోదావరి జిల్లా పెట్టింది పేరు. భీమవరం, చుట్టుపక్కల జరిగే పందేలకు ఉండే క్రేజ్‌ అంతా ఇంతా కాదు. చుట్టూ గ్యాలరీలు, ఎల్‌ఈడీ స్క్రీన్ల మధ్య జరిగే పందేలను వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాదు.. దేశ విదేశాల నుంచి బంధుమిత్రులు వస్తుంటారు. మూడు రోజుల్లో రూ.వంద కోట్లకు పైగా నగదు చేతులు మారుతుందని అంచనా. ఇప్పటికే బరుల ఏర్పాట్లలో నిర్వాహకులు నిమగ్నమయ్యారు. ప్రాంతం, బరి సైజును బట్టి రూ.15 లక్షల నుంచి రూ.కోటి వరకూ డిమాండ్‌ చేస్తున్నారు.

ఆక్వా సాగుపై అవగాహన

ఏలూరు(మెట్రో): ఆక్వాలో యాంటీ బయోటిక్స్‌ వాడకుండా తనిఖీలు నిర్వహించి, అవగాహన కల్పించాలని అధికారులకు జాయింట్‌ కలెక్టర్‌ ధాత్రిరెడ్డి సూచించారు.

బుధవారం శ్రీ 8 శ్రీ జనవరి శ్రీ 2025

సాక్షి, భీమవరం : భీమవరం చుట్టుపక్కల సీసలి, పెద అమిరం, కొవ్వాడ అన్నవరం, డేగాపురంలో నాలుగు భారీ బరులను సిద్ధం చేస్తున్నారు. ఒక్కో బరి దాదాపు రెండెకరాల్లో ఉండేలా ప్లాన్‌ చేసు ్తన్నారు. కోడిపందేల కోసం మధ్యలో పెద్ద దిమ్మ, చుట్టూ ప్రేక్షకులు కూర్చుని చూసేందుకు వీలుగా గ్యాలరీలు నిర్మిస్తున్నారు. పక్కనే భారీగా గుండాట, పేకాట ఇతర జూద కార్యకలాపాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని కలగంపూడి, వీరవాసరం, తణుకు, తాడేపల్లిగూడెం, కొణితివాడ, ఆచంట, కొత్తపాడు, కవిటం, వడలి, అయినపర్రు, గణపవరం, తదితర చోట్ల బరుల ఏర్పాట్లలో ఉన్నారు. చాలాచోట్ల టీడీపీ, జనసేన నాయకులు సిండికేటుగా, కొన్నిచోట్ల వేర్వేరుగా బరులను సిద్ధం చేయిస్తున్నట్టు తెలుస్తోంది.

భీమవరం ప్రాంతంలో

రూ.80 లక్షల నుంచి రూ.కోటి..

కేవలం కోడిపందేల ద్వారా బరులు నడిపితే నిర్వాహకులకు అంతగా వచ్చేది ఏమీ లేక నష్టపోవాల్సివస్తుంది. పెద్ద బరిలో రోజుకు 15 నుంచి 20 వరకు మాత్రమే పందేలు జరుగుతాయి. ఒక పందెం నిర్వహించేందుకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేస్తే మూడు రోజుల్లో వచ్చే మొత్తం రూ.5.5 లక్షలు నుంచి రూ.15 లక్షలు లోపే ఉంటుంది. బరి నిర్మాణం నిమిత్తం రూ. ఎనిమిది లక్షలు నుంచి రూ.12 లక్షల వరకు ఖర్చయితే, నేతలు, పోలీసులు, రెవెన్యూ, పంచాయతీ, ఫైర్‌ అధికారులకు మామూళ్లు, వారికి పంపే కోజాల (పందెం పుంజులు) ఖర్చు, బౌన్సర్లు, సిబ్బంది జీతాలు తదితర రూపాల్లో బరిని బట్టి రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షలు పైనే ఉంటుందని అంచనా. బరుల వద్ద గుండాట, పేకాట, ఇతర జూదాలు, అశ్లీల నృత్యాలు, మద్యం స్టాళ్లు, చికెన్‌ పకోడీ, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు పెట్టించడం ద్వారా ఈ ఖర్చును, తమ లాభాలను రాబడతారు. భీమవరం పరిసరాల్లోని బరులకు రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు, మిగిలిన ప్రాంతాల్లో జనాల రద్దీని బట్టి రూ.15 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు బేరసారాలు సాగిస్తున్నట్టు సమాచారం. కొన్నిచోట్ల ఇప్పటికే జూద నిర్వాహకులు బరులను దక్కించుకుని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆర్టీసీ బస్సులపై డీఎం పర్యవేక్షణ

తణుకు అర్బన్‌: ‘తణుకు ఆర్టీసీ బస్సుల్లో సమస్యల హారన్‌’ శీర్షికన సాక్షి పత్రికలో మంగళవారం ప్రచురితమైన కథనానికి డిపో మేనేజరు సప్పా గిరిధర్‌కుమార్‌ స్పందించారు. డిపో గ్యారేజ్‌లో బస్సులకు నిర్వహిస్తున్న మరమ్మతు లను ఆయన ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ఎలాంటి చిన్న ఇబ్బంది ఉన్నా వెంటనే పరిష్కరించిన తరువాతే బస్సును బయటకు పంపించాలని గ్యారేజీ సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా బస్సుల బాడీ మరమ్మతులు, పెయింటింగ్‌, వెల్డింగ్‌, ఎలక్ట్రికల్‌ పనులపై ఆరా తీశారు.

శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.85 కోట్లు

ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల నగదు లెక్కింపు స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో మంగళవారం కట్టుదిట్టమైన భద్రత నడుమ జరిగింది. ఈ లెక్కింపులో శ్రీవారికి విశేష ఆదాయం సమకూరింది. గత 40 రోజులకు నగదు రూపేణా స్వామికి రూ.3,85,61,549 ఆదాయంతో పాటు, కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 383 గ్రాముల బంగారం, 12.008 కేజీల వెండి, అధికంగా విదేశీ కరెన్సీ లభించినట్టు ఆలయ ఇన్‌చార్జీ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ.500, రూ.1,000, రూ.2,000 నోట్ల ద్వారా రూ.29,500 లభించినట్టు చెప్పారు.

మూగ జీవాల సంరక్షణకు కృషిచేయాలి

భీమవరం(ప్రకాశం చౌక్‌): పశువుల సంరక్షణకు అందరూ సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా జంతు సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. జంతువులు పట్ల దయ, కరుణ కలిగి ఉండాలన్నారు. కోడి పందేల్ని అరికట్టేందుకు గ్రామాలు, మండలాలు, డివిజన్‌ స్థాయి లో, సంయుక్త తనిఖీ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అడిషనల్‌ ఎస్పీ వి.భీమారావు మాట్లాడుతూ కోడి పందేలు, బరులు నిర్వహించకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. కోడి పందేల నిషేధంపై గోడ పత్రికను కలెక్టర్‌ చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ మొగలి వెంకటేశ్వర్లు, అదనపు ఎస్పీ వి.భీమారావు, పశు సంవర్ధక శాఖ అధికారి డా.కె.మురళీకష్ణ పాల్గొన్నారు.

12 వరకు అభ్యంతరాల స్వీకరణ

భీమవరం(ప్రకాశం చౌక్‌) ఎస్సీ కులగణనపై అభ్యంతరాల స్వీకరణ గడువును జనవరి 12 వరకు పొడిగించినట్లు కలెక్టర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. జనవరి 7తో గడువు ముగిసిన్పటికీ మరోసారి పొడించారన్నారు. సంబంధిత అధికారులు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారన్నారు. కులగణన సర్వే వివరాలను జనవరి 20న గ్రామ, వార్డు సచివాలయాల వద్ద విడుదల చేస్తారని వెల్లడించారు.

పెన్షన్లు మంజూరు చేయాలి

ఏలూరు (టూటౌన్‌): అర్హులైన డప్పు కళాకారులు, చెప్పులు కుట్టే చర్మకారులకు, లెదర్‌ వర్క్‌ కార్మికులకు పెన్షన్లు మంజూరు చేయాలని దళిత సేన ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసింది. ఆర్‌ఆర్‌పేటలోని దళిత సేన జిల్లా కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

పశ్చిమగోదావరి జిల్లాలో సిద్ధమవుతున్న కోడిపందేల బరులు

ఆకివీడు: కొల్లేరు సరస్సు అభయారణ్య పరిధిని రక్షించేందుకు ప్రభుత్వం ఎకో సెన్సిటివ్‌ జోన్‌ను ఏర్పాటు చేస్తోంది. అభయారణ్యం ఏర్పాటు జరుగుతున్న తరుణంలో ఎకో సెన్సిటివ్‌ జోన్‌ ఏర్పాటుతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని పలువురు రైతులు, ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జోన్‌ ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయ సేకరణకు ఆయా మండల కేంద్రాల్లో సదస్సులు నిర్వహిస్తున్నారు. ఆకివీడు తహసీల్దార్‌ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు.

ఐదో కాంటూరు పరిధి పెంపు

కొల్లేరు సరస్సులోని అభయారణ్యం ప్రాంతమైన ఐదో కాంటూర్‌ను పరిరక్షించేందుకు మరో 10 కిలోమీటర్ల మేర ఎకో సెన్సిటివ్‌ జోన్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తలపెట్టింది. కొల్లేరు సరస్సును పక్షులు విహరించేందుకు విశాలమైన ప్రాంతంగా గుర్తించారు. ఈ ప్రకారంగా ఐదో కాంటూర్‌ పరిధిని పెంచనున్నారు. పది కిలోమీటర్ల పరిధిలో ఏ విధమైన కట్టడాల నిర్మాణం, ఫ్యాక్టరీల నిర్మాణం, రోడ్ల నిర్మాణం చేపట్టకూడదు. చేపల చెరువులు, రొయ్యల చెరువుల సాగు చేపట్టకూడదు. కాలుష్యం, విషవాయువులు, ధ్వనులు వంటివి కొల్లేరు ఎకో సెన్సిటివ్‌లోకి రాకూడదు. సేంద్రీయ పద్ధతిలోనే వరి సాగు చేపట్టాలి. ఎరువులు, పురుగు మందుల వినియోగం చేయకూడదు. పలు కఠినమైన నిబంధనలతో ఈ జోన్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

కొల్లేరు ప్రజల కష్టాలు :

కొల్లేరును అభయారణ్యంగా మార్చేందుకు గతంలో టీడీపీ ప్రభుత్వం జీఓ 120ను విడుదల చేసింది. ఈ జీఓ అమలుతో జీరాయితీ రైతులు, పలు గ్రామాల ప్రజలు నేడు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. జీ రాయితీ భూముల్లో వ్యవసాయం చేసుకునేందుకు తీవ్ర కష్టాలు పడుతున్నారు. అభయారణ్య భూములు అమ్మడానికి, కొనడానికి అవకాశం లేకుండా పోయింది. జీ రాయితీ భూముల్లో చెరువులు తవ్వడానికి కూడా తీవ్ర ఇబ్బందులున్నాయి. కోర్టు కేసులతో రైతులు బెంబేలెత్తుతున్నారు. కొల్లేరులోని భూములను కట్నంగా తీసుకునేందుకు వెనకాడుతున్నారు.

11 మండలాలపై ప్రభావం

ఎకో సెన్సిటివ్‌ జోన్‌ ఏర్పడితే కాళ్ళ మండలంలోని సేట్‌ హైవేకి చేర్చి జోన్‌ బోర్డర్‌ ఏర్పడవచ్చునని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీంతో కాళ్ళ, కలిదిండి మండలాల్లోని కొన్ని గ్రామాలు, ఆకివీడు, కై కలూరు, మండవల్లి, నిడమర్రు, గణపవరం, ఉంగుటూరు, ఏలూరు, భీమడోలు, దెందులూరు మండలాలు సెన్సిటివ్‌ జోన్‌లోకి రానున్నట్లు తెలిసింది. ఆయా మండలాల్లో గత 40 ఏళ్ల నుంచి రైస్‌మిల్లులు, ఐస్‌ ఫ్యాక్టరీలు, ఆక్వా ప్లాంట్‌లు, ఇతర ఫ్యాక్టరీలు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు ఉన్నాయి. వీటన్నింటి నిర్వహణ ఎలా అనేది ప్రశ్నార్థకం కానుంది.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

పెదవేగి: అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారు. పెదవేగి ఎస్సై కె.రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన చిలకలపూడి చెన్నకేశవరావు(55) ఈ నెల 5న అర్ధరాత్రి సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యవసాయం కోసం చేసిన అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగాడు. వాంతులు చేసుకుంటుండగా భార్య చూసి కుటుంబసభ్యుల సాయంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 6న చెన్నకేశవరావు మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సాగుకు తీవ్ర ఇబ్బందులు

కొల్లేరు సరస్సును మూడో కాంటూర్‌కు కుదిస్తామన్నారు. ఇప్పడు ఎకో సెన్సిటివ్‌ జోన్‌ అంటూ ఊరే ఖాళీ చేయాలా?. కొల్లేరు తీరంలోని సిద్ధాపురంలో మా పొలాలు సాగు చేసుకోనివ్వడం లేదు. అభయారణ్యం అంటూ ఇబ్బందులు పెడుతున్నారు. చెరువులు తవ్వనివ్వడం లేదు. పక్షులకు ఇచ్చే విలువ మనిషి బతకడానికి ఇవ్వండి.

– తోట శివాజీ, రైతు, సిద్ధాపురం, ఆకివీడు మండలం.

కొల్లేరు ప్రజలను కాపాడండి

పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ప్రాణాల్ని కాపాడాల్సిన పరిస్థితి ప్రభుత్వంపై ఉంది. ఎకో సెన్సిటివ్‌ జోన్‌తో ప్రజలు మరింత ఇబ్బంది పడతారు. భూముల విలువలు పడిపోతాయి. చిత్తడి నేలలు, అభయారణ్యం, సెన్సిటివ్‌ జోన్‌ పేరుతో కొల్లేరు తీరంలోని గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

–జంపన సత్యనారాయణరాజు, మాజీ సర్పంచ్‌, సిద్ధాపురం

జోన్‌ను వ్యతిరేకిస్తున్నాం

కొల్లేరు సరస్సు పరిధిలోని ఐదో కాంటూర్‌ పరిధితోనే ఇబ్బంది పడుతున్నారు. సెన్సిటివ్‌ జోన్‌తో పరిశ్రమలు ఉండవు. ఉపాధి కోల్పోతారు. కాంటూర్‌ కుదింపు జరగాలి. సొసైటీల్ని పునరుద్ధారించాలి. కొల్లేరులో సెన్సిటివ్‌ జోన్‌ ఏర్పాటు చేస్తే వలసలు తప్పవు. – భూపతిరాజు తిమ్మరాజు, కొల్లేరు రైతు సంఘ ప్రతినిధి, సిద్ధాపురం

న్యూస్‌రీల్‌

జేబులుగుల్లే

ప్రత్యేకంగా బరుల వద్ద జూదాల నిర్వహణలో ఆరితేరిన వారు ఎంతోమంది ఉన్నారు. పందేలు చూసేందుకు వచ్చిన వారిని ఆకర్షించి వారి జేబులు గుళ్ల చేసి ఒట్టి చేతులతో పంపిస్తుంటారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా బరులను దక్కించుకునే పనిలో వీరంతా నిమగ్నమై ఉన్నారు. బరులను సిద్ధం చేయిస్తున్న వారితో బేరసారాలు సాగిస్తున్నారు.

పందేల ఊసెత్తని పోలీసులు

కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ సంక్రాంతికి రెండుమూడు వారాల ముందు నుంచే గ్రామగ్రామాన విస్తృత ప్రచారం చేసేవారు. సిద్ధం చేస్తున్న బరులను ధ్వంసం చేసి పందేలు నిర్వహించరాదని బ్యానర్లు కట్టించేవారు. డిసెంబరు నెలలోనే కోడి కత్తుల తయారీదారులు, కట్టే వారు, పందేలు, గుండాట, పేకాట నిర్వాహకులను బైండోవర్‌ చేస్తుండేవారు. గత ఏడాది జిల్లాలో దాదాపు 700 మందికి పైగా బైండోవర్‌ చేసి 1500కు పైగా కోడికత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సారి మాత్రం జిల్లాలో ఎక్కడా ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. సంక్రాంతికి రెండు నెలల ముందు నుంచే వారంలో రెండు మూడు చోట్ల రాత్రి వేళల్లో ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో కోడిపందేలు ఏర్పాటు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కోడిపందేల సంప్రదాయం మాటున జూద కార్యకలాపాలతో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నా పోలీసు యంత్రాంగం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

భీమవరం పరిసరాల్లో రూ.కోటి..

ఇతర చోట్ల రూ.15 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు రేటు

కోడిపందేల బరుల వద్దే గుండాట, పేకాటకు ఏర్పాట్లు

నియంత్రణ ఊసెత్తని పోలీసులు

No comments yet. Be the first to comment!
Add a comment
బరులకు బేరం1
1/13

బరులకు బేరం

బరులకు బేరం2
2/13

బరులకు బేరం

బరులకు బేరం3
3/13

బరులకు బేరం

బరులకు బేరం4
4/13

బరులకు బేరం

బరులకు బేరం5
5/13

బరులకు బేరం

బరులకు బేరం6
6/13

బరులకు బేరం

బరులకు బేరం7
7/13

బరులకు బేరం

బరులకు బేరం8
8/13

బరులకు బేరం

బరులకు బేరం9
9/13

బరులకు బేరం

బరులకు బేరం10
10/13

బరులకు బేరం

బరులకు బేరం11
11/13

బరులకు బేరం

బరులకు బేరం12
12/13

బరులకు బేరం

బరులకు బేరం13
13/13

బరులకు బేరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement