అగ్ని ప్రమాదంలో వ్యక్తి మృతి
ఏలూరు టౌన్: అగ్ని ప్రమాదంలో ఒక వ్యక్తి సజీవ దహనం కావడం ఏలూరులో కలకలం రేపింది. ఇంట్లో మంటలు చెలరేగడంతో లోపల ఉన్న వ్యక్తి హాహాకారాలు చేస్తూ మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఏలూరు వన్ టౌన్ సీఐ సత్యనారాయణ పరిస్థితిని పరిశీలించారు. బాధితుల వివరాలు మేరకు.. ఏలూరు దక్షిణపు వీధి పెద్ద దేవుడి గుడి సమీపంలో నివాసం ఉంటున్న పద్మావతి ఏలూరులో సచివాలయంలో ఏఎన్‌ఎంగా పనిచేస్తోంది. ఆమె తమ్ముడు జానా గంగాధర్ (30) కాకినాడ జిల్లా అన్నవరంలో తల్లిదండ్రులతో కలసి ఉంటున్నాడు. గంగాధర్‌కు ఇంకా వివాహం కాలేదు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఉదయం ఏలూరులోని అక్క పద్మావతి ఇంటికి వచ్చాడు. గంగాధర్ ఇంటిలో పడుకుని ఉండగా.. పద్మావతి ఉద్యోగానికి వెళుతూ ఇంటితలుపు బయట గడియ పెట్టి వెళ్లింది. అయితే ఇంట్లో నీళ్లు కాసేందుకు పెట్టిన వాటర్ హీటర్ కాలిపోవడం, విద్యుతాఘాతం కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గంగాధర్ లేచి తలుపు తీసేందుకు ప్రయత్నించగా బయట గడియ పెట్టి ఉండటంతో వీలు లేకుండాపోయింది. మంటలు చెలరేగడం, పొగ ఉక్కిరి బిక్కిరి చేయటంతో మంటల్లో చిక్కుకుని గంగాధర్ సజీవ దహనం అయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించారు.
సజీవ దహనం కావడంతో ఏలూరులో కలకలం
కారణాలపై పోలీసుల విచారణ
Comments
Please login to add a commentAdd a comment