శ్రీవారి క్షేత్రం భక్తులతో కిటకిట
ద్వారకాతిరుమల: సంక్రాంతి పండుగ ముగిసింది.. సంప్రదాయ క్రీడలకు.. ఆట, పాటలకు తెరపడింది. దాంతో గురువారం ఉభయ గోదావరి జిల్లాల నుంచి సొంత ఊళ్లకు పయనమైన వారంతా మార్గమధ్యలోని ద్వారకాతిరుమల క్షేత్రాన్ని సందర్శించారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి అతిథులతో శ్రీవారి ఆలయం కళకళలాడింది. మళ్లీ సంక్రాంతికి వస్తాం స్వామీ.. అంటూ వారంతా చినవెంకన్నను దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, అనివేటి మండపంలో భక్తులు పోటెత్తారు. శ్రీవారిని దర్శించిన వారిలో ఎక్కువగా తెలంగాణ రాష్ట్రానికి వెళ్లే వారే కనిపించారు. వారి వాహనాలే ఎక్కువగా కొండపైకి వచ్చాయి. దాంతో టోల్‌గేట్ ప్రాంతంలో పెద్ద ఎత్తున వాహనాలు బారులు తీరాయి.
Comments
Please login to add a commentAdd a comment