మూడు చోట్ల క్యాసినోలు
భీమవరం: సంక్రాంతి సంబరాల పేరుతో కోడి పందేలు, జూదాలే కాకుండా క్యాసినోలు ఆడడం చర్చనీయాంశంగా మారింది. భీమవరం పట్టణం, వీరవాసరం, భీమవరం మండలాల్లో మూడు చోట్ల క్యాసినోలు నిర్వహించినట్లు టీడీపీ నాయకుడే పబ్లిక్‌గా చెప్పారు. పండుగలో క్యాసినో నిర్వహిస్తే తప్పేమిటని సమర్ధించడం విశేషం. పండుగకు వారం రోజులు ముందుగా కలెకర్ట్ నాగరాణి, ఎస్పీ నయీం అస్మి కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినప్పటికీ విచ్చల విడిగా పందేలతోపాటు పేకాట, గుండాట, క్యాసినోలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో డ్యాన్స్ ప్రోగ్రాంలు నిర్వహించినా పోలీసు శాఖ అడ్డుకున్న దాఖలాలు లేవు.
భీమవరం నియోజకవర్గంలో..
భీమవరం నియోజకవర్గంలోని మూడు ప్రాంతాల్లో క్యాసినో నిర్వహించినట్లు తెలుస్తోంది. ఒక ప్రాంతంలో సాక్షాత్తు ఒక ప్రజాప్రతినిధి తనయుడే దీనికి నాయకత్వం వహించినట్లు చెబుతున్నారు. కోడిపందేల బరుల వద్ద పెద్ద మొత్తంలో సొమ్ములు తీసుకున్న నాయకులు క్యాసినో వంటి జూదం నిర్వహించడంపై పలువురు కూటమి పార్టీల నాయకులు విమర్శలు గుప్తిస్తున్నారు. క్యాసినో వంటి జూద క్రీడ నిత్యం ఆడిస్తే వస్తే అనేక కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment