కొండను తవ్వేస్తున్నారు
బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన గుళ్లపూడి నుంచి దొరమామిడి వెళ్ళే రహదారిలో ఉన్న కొండను కొందరు వ్యక్తులు తవ్వేసి అక్రమంగా తరలిస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొండలను గుల్ల చేస్తున్నారు. అక్రమంగా మట్టిని తవ్వి తరలిస్తున్నారనే సమాచారం ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికే గాడిదబోరు సమీపంలోని కొండతోపాటు పందిరిమామిడిగూడెం వెళ్ళే రహదారిలో ఉన్న కొండను కూడా కొల్లగొట్టి అక్రమంగా మట్టి రవాణా చేసినా కనీసం అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా కొండలను ఇష్టానుసారంగా తవ్వుతూ సొమ్ము చేసుకుంటున్నా అధికారులు పట్టించుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment