వేమన శత జయంతి ఉత్సవాలు ప్రారంభం
అత్తిలి: యోగివేమన శత జయంతి ఉత్సవాలు అత్తిలి మండలం ఆరవల్లిలో గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లా స్థాయి సీ్త్రల కబడ్డీ టోర్నమెంట్ కోర్టును గ్రామ ప్రముఖుడు గొలుగూరి వెంకటరెడ్డి ప్రారంభించారు. సర్పంచ్ వెలగల సుస్మితరెడ్డి, ఎంపీటీసీ దొమ్మేటి రమ్య జ్యోతి ప్రజ్వలన చేశారు. జిల్లా నుంచి ఆరు టీంలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. కబడ్డీ క్రీడాకారులను పలువురు గ్రామ ప్రముఖులు పరిచయం చేసుకున్నారు. తొలి మ్యాచ్ తణుకు– జంగారెడ్డిగూడెం జట్ల మధ్య జరగ్గా జంగారెడ్డిగూడెం జట్టు విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో అనంతపల్లి జట్టుపై ఉండి జట్టు విజయం సాధించినట్లు జిల్లా కబడ్డీ సెక్రటరీ శ్రీకాంత్ తెలిపారు. జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను రిటైర్డు డ్రిల్ మాస్టర్ వెలగల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. జయంతి ఉత్సవం ఈ నెల 18న జరుగుతుందని కమిటీ ఛైర్మన్ వెలగల అమ్మిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు సత్తి వెంకట శ్రీనివాసరెడ్డి, గొలుగూరి శ్రీరామారెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment