గ్రామీణ క్రీడల్ని ప్రోత్సహించాలి
‘సాగర్’ నీటి కష్టాలు
నూజివీడు నియోజకవర్గంలో రబీ పంటల సాగుకు అవసరమైన సాగర్ జలాల సరఫరాపై రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. 8లో u
ఆకివీడు: గ్రామీణ క్రీడల్ని పండుగ రోజుల్లో ప్రభుత్వమే ప్రోత్సహించాలని, యువత క్రీడా స్పూర్తితో ముందుకు వెళ్ళాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గోపీమూర్తి విజ్ఞప్తి చేశారు. సంక్రాంతి సందర్భంగా డీవైఎఫ్‌ఐ 42వ సంక్రాంతి పోటీల్లో వాలీబాల్ విజేతలకు గురువారం బహుమతులు అందజేశారు. మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, మన ప్రజా ప్రతినిధులు వీటిపై దృష్టి పెట్టాలన్నారు. అదనపు ఎస్‌పీ భీమారావు మాట్లాడుతూ 42 ఏళ్లుగా సంక్రాంతి క్రీడల్ని నిర్వహిస్తున్న డీవైఎఫ్‌ఐని అభినందించారు. క్రీడాకారులు తమ ప్రతిభతో క్రీడల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము, ఆహ్వాన సంఘ గౌరవధ్యక్షుడు ఎండీ మదనీ, కార్యదర్శి డీ.రవితేజ, సభ్యులు పాల్గొన్నారు. తాడినాడ, ఆకివీడు టీంలు విన్నర్, రన్నర్‌గా నిలిచాయి.
ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమగోదావరి జిల్లాలో చిల్డ్రన్ హోంలో ఖాళీగా ఉన్న పోస్టులకు కాంట్రాక్ట్, పార్ట్‌టైమ్ పద్ధతిలో పనిచేసేందుకు అర్హులైన స్థానిక మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈనెల 24వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యాలయం, కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణం రూము నెంబర్ 202లో స్వయంగా అందజేయలని సూచించారు. దరఖాస్తు తో పాటు సంబంధిత ధ్రువపత్రాలు, 4 నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ, ఆధార్, నివాస ధృవీకరణ పత్రాలు జతపరచాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment