కూటమి వచ్చాక సంక్షేమ పథకాలు అమలులేక పండుగలా లేదని ప్రజలు, వ్యాపారుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. సంక్రాంతి నాటికి చేస్తామని చెప్పిన గుంతలు పూడ్చే పనికూడా పూర్తి చేయలేకపోయామని కూటమి నేతలు ఆవేదన చెందుతున్నారు. నాసిరకం, అసంపూర్తి పనులతో రోడ్ల పరిస్థితి మరింత అధ్వానంగా మారిందని అంతర్మథనం చెందుతున్నారు. పనులు పూర్తవ్వక చుట్టాల ముందు చులకనయ్యామని చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది. గురువారం ఏలూరులో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో కూటమి ఎ మ్మెల్యేలే సమయానికి రోడ్డు పనులు పూర్తిచేయలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment