వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ ఇవ్వాలి
ఏలూరు (టూటౌన్): వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు విద్యుత్ సరఫరా చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక అన్నే భవనంలో జిల్లా అ ధ్యక్షుడు కట్టా భాస్కరరావు అధ్యక్షతన జరిగిన స మావేశంలో మాట్లాడారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరాను 7 గంటలకు కుదించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ప్రధానంగా మెట్టలో మొక్కజొన్న, మిర్చి, పొగాకు, ఉద్యాన పంటల రైతులు తీవ్ర ఇబ్బందులు పడతారన్నారు. ప్రభు త్వం వెంటనే జోక్యం చేసుకోకపోతే నిరసనలు చేపడతామని హెచ్చరించారు. వ్యవసాయానికి విద్యుత్‌ను 9 గంటల నుంచి 7 గంటలకు కుదించడం దారుణమన్నారు. అప్రకటిత విద్యుత్ కోతలపై అన్నదాతలు ఆందోళన చెందతుఉన్నారని అన్నారు. అలాగే కొత్తగా బోర్లు వేసుకున్న రైతులకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని కోరారు. సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు సిరిబత్తుల సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment