‘స్వచ్ఛ ఆంధ్ర’కు చర్యలు
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ఇకపై ప్రతి మూ డో శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ దివాస్’ కార్యక్రమం నిర్వహణకు చర్య లు చేపట్టినట్టు కలెక్టర్ నాగరాణి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో ఆమె మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతానికి సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో పట్టణ స్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ అధికారులు అంకితభావంతో భాగస్వాములు కా వాలని పిలుపునిచ్చారు. డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రామీణ నీటి సరఫరా అధికారి బీవీవు, డీపీఓ అరుణశ్రీ, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు, అధికారులు పాల్గొన్నారు.
రిపబ్లిక్ డే వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు
భీమవరం కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్‌లో 76వ గణతంత్ర దినోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. వేదిక ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు తాగునీటి ఏర్పాట్లు చేయాలన్నారు. సంక్షేమ, అభివృద్ధి పథ కాల శకటాలు, స్టాల్స్‌ను సిద్ధం చేయాలన్నారు. భద్రతా చర్యలు, సాంస్కృతిక కార్యక్రమాలు, స్వాతంత్ర సమరయోధులు, ప్రజాప్రతినిధులు, అతిథులు సిట్టింగ్ ఏర్పాట్లపై సూచనలిచ్చారు. డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, ఏఎస్పీ వి.భీమారావు, ఆర్డీఓ కె.ప్రవీణ్‌కుమార్ రెడ్డి, డీఈఓ ఈ.నారాయణ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ నాగరాణి
Comments
Please login to add a commentAdd a comment