వివాహిత మృతి
బంధువులను పరామర్శించడానికి వెళ్తున్న వివాహిత రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శివదేవుని చిక్కాలలో చోటుచేసుకుంది. IIలో u
అధ్వానంగా రోడ్డు
మా స్వగ్రామం అత్తిలి కాగా హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాను. ఏటా మాదిరి ఈసారీ సంక్రాంతికి సొంతూరు వచ్చాను. భీమవరం నుంచి అత్తిలి వచ్చే రోడ్డు దారి పొడవునా పెద్దపెద్ద గోతులతో చాలా ప్రమాదభరితంగా ఉంది. త్వరితగతిన రోడ్డు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి.
– సత్యాల మనోహర్,
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, హైదరాబాద్
గుంతలు పూడ్చలేదు
సంక్రాంతి పండుగ కోసం ఐర్లాండ్ నుంచి స్వస్థలానికి వచ్చాను. సంక్రాంతికి గుంతలు లేకుండా రోడ్లను అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెప్పినట్టుగా సోషల్ మీడియాలో చూశాను. ఇక్కడకు వచ్చాక చూస్తే రాళ్లుపైకి లేచిపోయి రోడ్లు అధ్వానంగా కనిపించాయి. సమస్య పరిష్కారానికి చొరవ చూపాలి.
– అంబటి కల్యాణ్, ఎన్‌ఆర్‌ఐ, నరసాపురం
Comments
Please login to add a commentAdd a comment