తణుకు పోలీస్‌స్టేషన్ వద్ద హైడ్రామా
తణుకు అర్బన్: వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్త పంజా దుర్గారావుపై తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చేసిన దౌర్జన్యకాండ శుక్రవారం తణుకులో సంచలనం రేకెత్తించింది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న అభిమానంతో వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా, అధికార పార్టీ చేస్తున్న అక్రమాలను సోషల్ మీడియా ద్వారా ఎండగడుతున్న దుర్గారావును టార్గెట్ చేసిన ఎమ్మెల్యే నడిరోడ్డుపై ఒక సామాన్య ఆటో డ్రైవర్ అని కూడా చూడకుండా వెంటాడి వీరంగం చేసిన ఘటనను ప్రజలు చీదరించుకుంటున్నారు. బెదిరించి, ఇష్టానుసారంగా దూషించిన తర్వాత పోలీసులకు అప్పగించడం, ఆపై స్టేషన్‌లో నడిచిన హైడ్రామాపై పలువురు విమర్శిస్తున్నారు. ఉదయం 12 గంటల నుంచి తణుకు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో హై డ్రామా నడిచింది. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్న దుర్గారావును స్టేషన్ లో ఎవరూ కలవకుండా నిర్బంధించడం, వ్యవహారాన్ని గుట్టుగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది. టీడీపీకి చెందిన ప్రముఖులు స్టేషన్‌కు రావడం, అధికారులతో మంతనాలు జరపడం, లీగల్ బృందంతో సంప్రదింపులు జరపడం వెనుక భారీ కుట్రపూరిత వ్యవహారం నడుస్తోందని వైఎస్సార్‌సీపీ శ్రే ణులు, కుటుంబసభ్యులు భయాందోళనలు వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు ఏ కేసులు న మోదు చేస్తారో, ఎక్కడికి తీసుకువెళ్తారోననే ఉత్కంఠ నడిచింది. రాత్రి 10.30 గంటలు గడిచినా దుర్గారావును స్టేషన్‌లోనే ఉంచడం, సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై విచారణ చేయాల్సి ఉందని పోలీసు అధికారులు చెబుతుండటం వంటి అంశాలు అనుమానాస్పదంగా మారాయి.
విడ్డూరంగా ఆర్టీఓ తీరు
సామాన్య ఆటోడ్రైవర్ వ్యవహారానికి సంబంధించి ఎమ్మెల్యే ఆదేశాలతో ఆర్టీఓ హుటాహుటిన పోలీసుస్టేషన్‌కు రావడం, వెంటనే దుర్గారావు ఆటోను స్వా ధీనం చేసుకుని నిమిషాల వ్యవధిలోనే తణుకు ఆ ర్టీసీ బస్‌డిపోకు తరలించడం విడ్డూరంగా మారింది. ట్రాఫిక్ రూల్స్ పాటించలేదని, జిల్లా మారి హై వేపైకి ఆటో వచ్చిందని తదితర కారణాలు చూపించి రూ.3,400 జరిమానా విధించడం, రవాణా కార్యాలయం నుంచి పనిగట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు వచ్చి మరీ అధికారం చూపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అధికారులు చూపిస్తున్న అధికారదర్పాన్ని చూసిన తోటి ఆటోడ్రైవర్లు ముక్కున వేలేసుకున్నారు.
కన్నీరుమున్నీరవుతున్న భార్య, పిల్లలు
భర్త దుర్గారావును చూసేందుకు తణుకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన భార్య నాగలక్ష్మి, కుమార్తెలు కన్నీరుమున్నీరయ్యారు. ముఖ్యంగా ఆడబిడ్డల రోదనలు తణుకువాసులను కదిలించాయి. జగన్‌పై ఉన్న అభిమానంతో పోస్టులు పెడతారని, జగన్‌పై అభిమానంతో ఉండటం తప్పా అని నాగలక్ష్మి రోదించారు. తన భర్తకు ఏదైనా జరిగితే తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ బాధ్యత వహించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై ఎమ్మెల్యే ఆరిమిల్లి దౌర్జన్యకాండ
ఎమ్మెల్యే హుకుంతో స్టేషన్‌కు వచ్చిన ఆర్టీఓ
మధ్యాహ్నం 12 గంటల నుంచి పోలీస్‌స్టేషన్‌లోనే బాధితుడు
Comments
Please login to add a commentAdd a comment