రీ సర్వేపై అవగాహన అవసరం
భీమవరం: రీ సర్వేపై రెవెన్యూ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం భీమవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీలార్లు, మండల సర్వేయర్లు, డీటీలు, వీఆర్వోలతో ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నాలుగో దశ రీ సర్వే పనులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జేసీ మాట్లాడుతూ సర్వే రికార్డులు పారదర్శకంగా నిర్వహించాలన్నారు. గ్రామ సరిహద్దులు కచ్చితంగా పాటించాలన్నారు. శాఖల వారీగా ఇరిగేషన్, డ్రైనేజీ, దేవస్థానం, జెడ్పీ భూములకు సంబంధించి ముందుగా నోటీసులు ఇచ్చి సర్వే నిర్వహించాలన్నారు. రైతులకు కూడా ముందుగా నోటీసులు ఇచ్చి వారి సమక్షంలోనే సర్వే చేయాలన్నారు. ఆర్డీఓ కె.ప్రవీణ్‌కుమార్ రెడ్డి, ఇన్‌చార్జ్ జిల్లా సర్వే అధికారి కె.శ్రీనివాస్, డివిజన్ సర్వే అధికారులు మల్లికార్జునరావు, రాంబాబు పాల్గొన్నారు.
నేడు ‘నవోదయ’ పరీక్ష
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): 2025–26 విద్యా సంవత్సరానికి జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు పరీక్షను శనివారం నిర్వహించనున్నట్టు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. జి ల్లాలో 13 కేంద్రాలను ఏర్పాటుచేశామని, ఉ దయం 10 గంటలకు విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. నవోదయ వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకుని తీసుకురావాలన్నారు. బ్లాక్ లేదా బ్లూ పెన్‌తో మాత్రమే జవాబులు బబుల్ చేయాలని, కేంద్రాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు. మరిన్ని వివరాలకు హెల్ప్‌లైన్ నంబర్లు 63030 39477, 94907 287768, 96406 76608, 90785 68664, 80748 33690, 94917 31486లో సంప్రదించాలని కోరారు.
పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి
భీమవరం: పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అకౌంటెంట్ జనరల్ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఎస్.బాలాజీ అన్నారు. భీమవరం సబ్ ట్రెజరీ కార్యాలయంలో శుక్రవారం ఆయన తనిఖీలు చేశారు. పెన్షన్ అసోసియేషన్ నాయకులు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా బా లాజీ మాట్లాడుతూ అసోసియేషన్ నాయకులు సమైక్యంగా పెన్షనర్లకు సేవలందించడం అభినందనీయమన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గాతల జేమ్స్, భీమవరం యూనిట్ ప్రధాన కార్యదర్శి పి.సీతారామరాజు, పి.సూర్యనారాయణ, కె.ముత్యాలరావు, కె.చంద్రరావు, ఆర్‌ఎస్ సూర్యనారాయణ, బి.సత్యనారాయణరాజు పాల్గొన్నారు.
పోలీసుల అదుపులో కిడ్నాపర్లు
భీమవరం: భీమవరంలో గురువారం ఆక్వా వ్యాపారి వి.సత్యనారాయణను కిడ్నాప్ చేసిన వ్యక్తులను అనంతపురంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఆర్థిక లావాదేవీల కారణంగా కొందరు వ్యక్తులు కారులో వచ్చి భీమవరం టౌన్ రైల్వేస్టేషన్ వద్ద సత్యనారాయణను బలవంతంగా తీసుకువెళ్లారు. కేసు దర్యాప్తులో భాగంగా టూటౌన్ సీఐ జి.కాళీచరణ్ సీసీ పుటేజీల ద్వారా కిడ్నాప్ చేసిన కారు వెళ్లిన మార్గాలను పరిశీలిస్తూ అనంతపురం పోలీసులను అప్రమత్తం చేశారు. దీనిపై పోలీసులను వివరణ కోరగా కేసు దర్యాప్తులో ఉందని చెప్పారు.
డీఎస్పీ జయసూర్య బదిలీ
భీమవరం: భీమవరం డీఎస్పీ ఆర్‌జే జయసూర్య బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఎస్.మహేంద్రను నియమిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ఇరిగేషన్ ఎస్‌ఈగా నాగార్జునరావు
ఏలూరు(మెట్రో): ఏలూరు సర్కిల్ ఇరిగేషన్ ఎస్‌ఈగా పి.నాగార్జునరావు నియమితులయ్యారు. ఇరిగేషన్ శాఖలో ఇచ్చిన పదోన్నతులు, బదిలీల్లో భాగంగా నాగార్జునరావును ప్రభుత్వం బదిలీ చేసింది. నాగార్జునరావు ప్రస్తుతం గోదావరి వెస్ట్రన్ డివిజన్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన గతంలో భీమవరం డ్రైనేజీ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా ఆరేళ్లు సేవలందించారు.
Comments
Please login to add a commentAdd a comment