వాసవీధాం పీఠాధిపతిగా ప్రజ్ఞానంద సరస్వతీ స్వామీజీ
పాలకొల్లు అర్బన్: అఖిల భారత వాసవీ ధాం పెనుగొండ ట్రస్ట్ పీఠాధిపతిగా తెనాలి శ్రీ విద్యా పీఠానికి చెందిన ప్రజ్ఞానంద సరస్వతీ స్వామీజీ ఈ నెల 8న పట్టాభిషిక్తుడు కానున్నట్లు వాసవీ ధాం రాష్ట్ర అధ్యక్షుడు చిన్ని రామ సత్యనారాయణ తెలిపారు. పాలకొల్లు వాసవీ కల్యాణ మండపంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు పీఠాధిపతిగా వ్యవహరించిన కృష్ణానందపురి స్వామీజీ మృతి చెందారన్నారు. దీంతో ఆయన స్థానంలో ప్రజ్ఞానంద సరస్వతీ స్వామీజీ పట్టాభిషిక్తులు కానున్నట్లు చెప్పారు. పెనుగొండలో జరిగే పట్టాభిషేకం కార్యక్రమానికి పలువురు స్వామీజీలు, పీఠాధిపతులు హాజరుకానున్నట్లు వివరించారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బంగారు ఉషారాణి, ఆర్యవైశ్య సంఘ జిల్లా అధ్యక్షుడు చిర్లంచర్ల సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి కందకట్ల రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment