భువనగిరిరూరల్ : రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని ఒక్క గింజ కూడా వదలకుండా కొనుగోలు చేయాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. శుక్రవారం భువనగిరి మండలంలోని నందనం గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. కాంటా వేసిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. నిబంధనల ప్రకారం తేమ శాతాన్ని పరిశీలించి, మద్దతు ధర దక్కేలా చూడాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 9,302 మంది రైతుల నుంచి 97,812 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, అందులో 88,845 టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించినట్లు చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.226 కోట్ల ఉంటుందని, రైతుల ఖాతాల్లో రూ.76 కోట్లు జమ చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment