గ్రూప్–3కి 15 కేంద్రాలు
అభ్యర్థులు ఇవి పాటించాలి
● నలుపు లేదా నీలం బాల్‌పాయింట్ పెన్నుతోనే పరీక్ష రాయాలి. పెన్సిల్, ఎరేజర్ తీసుకెళ్లాలి.
● హాల్‌టికెట్, ప్రభుత్వం జారీ చేసిన ఫొటో గుర్తింపుకార్డు తీసుకెళ్లాలి.
● సెల్‌ఫోన్, చేతి గడియారం, క్యాలిక్యులేటర్ తది తర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు.
● చెప్పులు మాత్రమే ధరించి రావాలి. అభరణాలు, మెహిందీ, టాటూలను వేసుకోరాదు.
● హాల్ టికెట్ డౌన్‌లోడ్ సమయంలో సమస్య వస్తే సంబంధిత అధికారులను సంప్రదించాలి.
సాక్షి,యాదాద్రి : టీఎస్‌పీఎస్సీ ఈనెల 17, 18 తేదీల్లో నిర్వహించే గ్రూప్ –3పరీక్షకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 15 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షకు 6,043 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇందులో పురుషులు 3,240, మహిళలు 2,803 మంది ఉన్నారు. పరీక్ష నిర్వహణకు చీఫ్ సూపరిండెంట్లు 15, బయోమెట్రిక్ అధికారులు 46, పరిశీలకులు 17, డిపార్ట్‌మెంటల్ అధికారులు 15, ఐడెంటిఫికేషన్ అధికారులు 65, ఇన్విజిలేటర్లు 253, జాయింట్ రూట్ అధికారులు 3, ఫ్లయింగ్ స్క్వాడ్ ఐదుగురిని నియమించారు.
నిర్దేశిత సమయానికి కేంద్రాల గేట్లు బంద్
17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్–1, మధ్యాహ్నం 3గంటల నుంచి 5.30 వరకు పేపర్–2 పరీక్ష జరుగుతుంది. 18న ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్–3 పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. నిర్దేశిత సమయం తరువాత అనుమతించరు.
సెంటర్ల వద్ద 144 సెక్షన్
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించనున్నారు. పరీక్ష జరిగే సమయంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలి. ఫస్ట్ ఎయిడ్ కిట్, మందులు, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ టీచర్‌తో పాటు అంబులెన్సును అందుబాటులో ఉంచుతారు. పరీక్ష సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఆశాఖ అధికారులకు ఉన్నతస్థాయి ఆదేశాలు అందాయి.
ఫ 17, 18 తేదీల్లో పరీక్ష
ఫ హాజరుకానున్న 6,043 మంది అభ్యర్థులు
ఫ సెంటర్ల వద్ద 144 సెక్షన్
అరగంట ముందే చేరుకోవాలి
అభ్యర్థులు నిర్దేశిత సమయానికి అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. భువనగిరిలోని దివ్యబాల పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హాల్‌టికెట్‌పై అభ్యర్థి ఫోటో సరిగా కనిపించని పక్షంలో గెజిటెడ్ అధికారి లేదా చివరగా చదువుకున్న విద్యాసంస్థ ప్రిన్సిపాల్ అటెస్ట్, మూడు పాస్ ఫొటోలతో వెబ్‌సైట్‌లో పొందుపరిచిన ధ్రువీకరణ పత్రాన్ని పూర్తిచేసి ఇన్విజిలేటర్‌కు అందజేయాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment