అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
బీబీనగర్ : మండల పరిధిలోని ఆర్మీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఇంగ్లిష్, గణితం, జనరల్ సైన్స్ సబ్జెక్టులు బోధించుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ నిరూప ఒక ప్రకటనలో తెలిపారు. పీహెచ్‌డీ, నెట్, సెట్, పీజీ అర్హతలు కలిగి ఉండాలని, పై సబ్జెక్టుల్లో బోధన అనుభవం కలిగి ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గలవారు డిసెంబర్ 2 తేదీ లోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
ఆశ్రమాల నిర్వహణకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
భువనగిరి టౌన్ : దివ్యాంగుల సంక్షేమం కోసం నిర్వహిస్తున్న పాఠశాలలు, ఆశ్రమాలు, సంస్థలు దివ్యాంగుల సంక్షేమ చట్టం–2016 ప్రకారం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి నర్సింహారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారి, మహిళా శిశు వికలాంగుల కార్యాలయంలో ఈనెల 30వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ లేకుండా నిర్వహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
శివాలయంలో చండీహోమం, అభిషేకం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వత వర్థిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. రుద్రాభిషేకం, చండీహోమం, అభిషేక చేశారు.అదే విధంగా ప్రధానాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులకు అభిషేకం, అర్చన, ఆలమ ముఖమండపంలో సుదర్శన నారసింహహోమం, స్వామి, అమ్మవారికి నిత్యకల్యాణం సాయంత్రం జోడు సేవోత్సవం తదితర పూజలు చేపట్టారు. అదే విధంగా ఊంజలి సేవోత్సవం నేత్రపర్వంగా సాగాంది.
వైభవంగా చక్రతీర్థం
వలిగొండ : మండలంలోని వెంకటాపురంలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అయ్యాయి. చివరి రోజు శుక్రవారం కుంబారాధన, చతుస్థానార్చన, నిత్యాహోమాలు, ద్వారాతోరణ బలి, మహాపూర్ణాహుతి, చక్రతీర్థం,నివేదన, తీర్థప్రసాద గోష్ఠి వేడుకలు నిర్వహించారు. ఆలయ హుండీలను శనివారం (నేడు) లెక్కించనున్నట్లు ఆలయ ఈఓ మోహన్‌బాబు తెలిపారు. వేడుకల్లో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కొమ్మారెడ్డి నరేష్‌కుమార్, సభ్యులు, పాల్గొన్నారు. అదే విధంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు సత్యనారాయణస్వామి వత్రాలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment