రైతులకు ఇబ్బంది కలిగించవద్దు
రామన్నపేట, వలిగొండ : ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, రైతులకు ఇబ్బంది కలిగిస్తే ఉపేక్షించబోమని అదనపు కలెక్టర్ వీరారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రామన్నపేట మండలం ఇంద్రపాలనగరంలోని కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. సీరియల్ ప్రకారం ధాన్యాన్ని తూకం వేయాలని, కాంటా వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని ఆదేశించారు. మిల్లుల వద్ద ధాన్యం దిగుమతి విషయంలో జాప్యం జరిగితే వెంటనే సమాచారం ఇవ్వాలని కేంద్రాల నిర్వాహకులకు సూచించారు.అదే విధంగా వలిగొండ మండలం నాగారం సమీపంలోని శ్రీ వాసవి రైస్ ఇండస్ట్రీస్‌ను అదనపు కలెక్టర్ సందర్శించారు. కొర్రీలు పెట్టకుండా సకాలంలో ధాన్యం దిగుమతి చేసుకోవాలని యజమానికి సూచించారు. ఆయన వెంట తహసీల్దార్లు లాల్‌బహదూర్, శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్ సీఈఓ జంగారెడ్డి, ఏఓ ఉన్నారు.
కుటుంబ సర్వేలో పొరపాట్లకు తావుండరాదు
చౌటుప్పల్ : పొరపాట్లు తావులేకుండా సమగ్ర కుటుంబ సర్వే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ గంగాధర్ సూచించారు. చౌటుప్పల్‌లో కుటుంబ సర్వేను ఆయన పరిశీలించారు. అలాగే మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి అధికారులతో మాట్లాడి సర్వే తీరును తెలుసుకున్నారు. సూపర్‌వైజర్లు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, మేనేజర్ శ్రీధర్‌రెడ్డి, ఎంపీడీఓ యూకూబ్ ఉన్నారు.
ఫ అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment