ఫీజు రాయితీకి నిబంధనాలు
నిబంధనల మార్పు
ప్రభుత్వ పరిధిలోనిది
ఫీజు రాయితీ నిబంధనల మార్పు ప్రభుత్వ పరిధిలోని విషయం. ప్రస్తుతం ఉన్న నిబంధనం ప్రకారం వార్షిక ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందజేసిన విద్యార్థులకు పరీక్ష ఫీజు రాయితీ ఉంటుంది. ఫీజు రాయితీ విషయాన్ని ఇప్పటికే విద్యార్థులకు తెలియజేశాం.
–సత్యనారాయణ, డీఈఓ
భువనగిరి: బడుగు, బలహీన వర్గాలకు చెందిన పదో తరగతి విద్యార్థుల వార్షిక పరీక్ష ఫీజు రాయితీకి ఆదాయ నిబంధనలు అడ్డంకిగా మారాయి. దశాబ్దాల నాటి నిబంధనలనే విద్యాశాఖ అమలు చేస్తుండడం, ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా లేకపోవడంతో విద్యార్థులు ఫీజు రాయితీ పొందలేకపోతున్నారు. ఈ విద్యా సంవత్సరమైనా నిబంధనలు మారుస్తారని ఆశించినా ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు.
నిబంధనలు ఇవీ..
2024–25 విద్యా సంవత్సరానికి గాను ఇటీవల పరీక్ష ఫీజు షెడ్యూల్ రావడంతో విద్యార్థులు ఫీజు చెల్లించే పనిలో ఉన్నారు. అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించేందుకు ఈనెల 18వ తేదీ గడువు విధించింది. రెగ్యులర్ విద్యార్థులు రూ.125 చెల్లించాలి. మొదటిసారి పరీక్షకు హాజరయ్యే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు రాయితీ ప్రకటించింది. రాయితీ పొందాలంటే తల్లిదండ్రుల వార్షిక ఆదాయం సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంది. పట్టణ ప్రాంతాల్లో నివసించే వారైతే రూ.24వేలు, గ్రామీణ ప్రాంతాల వారికి రూ.20 వేలు వార్షిక ఆదాయం ఉంటేనే అర్హులు. ప్రస్తుతం ఎవ్వరూ ఇంత తక్కువ ఆదాయ కలిగి లేరు. కూలినాలి చేసుకునే వారికి కూడా రూ.లక్షల్లో ఆదాయం ఉంటుంది. రూ.లక్ష లోపు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు తహసీల్దార్లు సైతం ససేమిరా అంటున్నారు. సంక్షేమ పథకాలు పొందాలంటే గ్రామీణ ప్రాంతాల వారికి వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్ష వరకు పరిమితి ఉంది. ఇదే విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా విద్యాశాఖ ఏళ్ల క్రితం విధించిన నిబంధనలతో విద్యార్థులు ఫీజు రాయితీ పొందలేకపోతున్నారు. మార్చిలో జరిగే వార్షిక పరీక్షలకు జిల్లాలో 9,290 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరంతా ఫీజు రాయితీకి దూరం కానున్నారు.
ఫ వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల వారికి రూ.20 వేలు, గ్రామీణులకు రూ.24 వేలు
ఫ దశాబ్దాల నాటి రూల్స్‌నే అమలు చేస్తున్న విద్యాశాఖ
ఫ రూ.లక్షలోపు ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీకి తహసీల్దార్లు ససమేమిరా
ఫ నష్టపోతున్న పదో తరగతి విద్యార్థులు
ఫ పరీక్ష ఫీజు చెల్లింపునకు ఈనెల 18 చివరి తేదీ
ఉన్నత పాఠశాలలు 275
ప్రభుత్వ స్కూళ్లు 188
ప్రైవేట్ 87
టెన్త్ విద్యార్థులు 9,290
Comments
Please login to add a commentAdd a comment