సమస్యలు ఇవీ..
గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేసి నాలుగుళ్లు గడిచినా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. కనీస సౌకర్యాలైన సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, వీధి దీపాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మురుగు నీరు వీధుల్లో ప్రవహిస్తుండడంతో దోమలకు నిలయంగా మారుతున్నాయి. వీధి దీపాలు సరిగా లేకపోవడంతో రాత్రి సమయంలో మహిళలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఇక పారిశుద్ధ్య చర్యలు కూడా అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. బొమ్మాయిపల్లి పరిధిలోని కాలనీకి శానిటేషన్ సిబ్బంది 10 రోజలకు ఒక్కసారి వెళ్తుండడంతో వీధులన్నీ చెత్తాచెదారంతో నిండిపోయాయని గ్రామస్తులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment