చేనేత సమస్యలు పరిష్కరించాలని వినతి | - | Sakshi
Sakshi News home page

చేనేత సమస్యలు పరిష్కరించాలని వినతి

Published Wed, Nov 27 2024 7:04 AM | Last Updated on Wed, Nov 27 2024 7:04 AM

-

భూదాన్‌పోచంపల్లి: చేనేత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర చేనేత, జౌళిశాఖ కమిషనర్‌ శైలజా రామయ్యర్‌తో పాటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిని పోచంపల్లికి చెందిన చేనేత నాయకులు వేర్వేరుగా కలిసి వినతిపత్రం అందజేశారు. చేనేత సహకార సంఘంలో పేరుకుపోయిన వస్త్ర నిల్వలను కొనుగోలు చేయాలని, నేత బజార్‌ సమస్యకు పరిష్కారం చూపి కార్మికులకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. చేనేత సంక్షేమ పథకాలు ప్రతిఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఏలే భిక్షపతి, గంజి కృష్ణ, భోగ నర్సింహ తదితరులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement