కష్టపడ్డాం.. కొలువు సాధించాం
ఇటీవల మేడ్చల్ జిల్లాలో ట్రైనింగ్ పూర్తిచేసుకున్న నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు కానిస్టేబుళ్లు తమకు కేటాయించిన పోలీస్ స్టేషన్లలో పోస్టింగ్‌ల్లో చేరారు. పోలీస్ యూనిఫాం వేసుకోవాలనే కలను సాకారం చేసుకునేందుకు ఎంతో కష్టపడ్డామని, పట్టుదలతో చదివి కొలువు సాధించామని వారు తమ అభిప్రాయాలను సాక్షితో పంచుకున్నారు.
మా తల్లిదండ్రుల గౌరవం పెరిగింది
నా తల్లిదండ్రులు నన్ను కష్టపడి చదివించారు. తల్లిదండ్రుల కలను సాకారం చేస్తూ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాను. ప్రభుత్వ ఉద్యోగం రావడంతో సమాజంలో నా తల్లిదండ్రుల గౌరవం పెరిగింది.
– వంశీ, మదారిగూడెం, హాలియా
సంతోషంగా ఉంది
ఉద్యోగం రావడంతో నాతో పాటు నా తల్లిదండ్రులు, తోబుట్టువులు ఎంతో సంతోషంగా ఉన్నారు. కానిస్టేబుల్‌గా పనిచేస్తూనే ఉన్నత ఉద్యోగం సాధించేందుకు ప్రయత్నిస్తా. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తాను.
– బీరం శివాజి, శాలిగౌరారం
తల్లిదండ్రుల కల సాకారం చేశా
చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు నన్ను ఎంతో కష్టపడి చదివించి నా బంగారు భవిష్యత్‌కు బాటలు వేశారు. వారి కష్టం వృథా కానియ్యకుండా కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి వారి కలను సాకారం చేశా.
– సీహెచ్. వెంకన్న, తొండల్‌వాయి, నార్కట్‌పల్లి
భార్య, అమ్మ ప్రోత్సాహంతోనే కానిస్టేబుల్ అయ్యాను
మా అమ్మ లక్ష్మి, భార్య ప్రియాంకతో పాటు కుటుంబ సభ్యుల ప్రోత్పహంతోనే కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాను. ట్రైనింగ్ మొదట్లో కొంత ఇబ్బంది పడినప్పటికీ నా భార్య, అమ్మ ప్రోత్సాహంతో క్రమశిక్షణతో అన్ని అంశాల్లో శిక్షణ పొందాను.
– తురక సందీప్, తడకమళ్ల, మిర్యాలగూడ
Comments
Please login to add a commentAdd a comment