రాజాపేట @11.8
భువనగిరి, మోటకొండూర్ : చలితీవ్రతకు జిల్లా వణికిపోతోంది. వారం రోజుల కిందట 15 డిగ్రీల పైబడి నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. తాజాగా 12డిగ్రీలకు పడిపోవటంతో జనం గజగజ వణకాల్సి వస్తోంది. బుధవారం రాజాపేటలో 11.8, భూదాన్‌పోచంపల్లి, బొమ్మలరామారం, చౌటుప్పల్, తుర్కపల్లి మండలాల్లో 12, ఆలేరు, గుండాల, రామన్నపేట, బీబీనగర్, మోత్కూరు, యాదగిరిగుట్ట మండలాల్లో 14 డిగ్రీల సెల్సీయస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత కారణంగా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. చలినుంచి ఉపశమనం పొందడానికి ఉద యం, రాత్రిళ్లు జనం చలిమంటలు కాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment