గిరిజన చట్టాలపై అవగాహనే లక్ష్యం
నాగార్జునసాగర్: గిరిజన చట్టాలపై గ్రామస్థాయి నుంచి పూర్తి అవగాహన కలిగి ఉండాలనే లక్ష్యంతో దేశంలోని 15 రాష్ట్రాల్లో గిరిజనులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని ఆదివాసీ కాంగ్రెస్ నేషనల్ చైర్మన్ మోగె శివాజీరావు అన్నారు. తెలంగాణలో మొదటిసారిగా నాగార్జునసాగర్‌లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సోమవారం సాగర్‌లో జరుగుతున్న శిక్షణ తరగతులకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలోని గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధే రాహుల్ గాంధీ ఆశయమన్నారు. ఆరు నెలల కాలంలో 29 రాష్ట్రాల్లో గిరిజన, ఆదివాసీ కాంగ్రెస్ ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 5వేల మందికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన చట్టాలు, హక్కులు, అటవీ, రెవెన్యూ చట్టాలు, రాజ్యాంగంలో ఆదివాసీల కోసం అమలవుతున్న ఆర్టికల్స్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్‌నాయక్, పలు రాష్ట్రాల నాయకులు పాల్గొన్నారు.
06 హెచ్‌ఎల్‌ఎ 101
ఆదివాసీ కాంగ్రెస్ నేషనల్
చైర్మన్ మోగె శివాజీరావు
Comments
Please login to add a commentAdd a comment