వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్ల పరిశీలన
యాదగిరిగుట్ట: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఈ నెల 10వ తేదీన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈఓ భాస్కర్‌రావు ఆధ్వర్యంలో వైకుంఠ ద్వార దర్శనానికి అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఉత్తరం మాడ వీఽఽధిలో స్వామివారిని అధిష్టింపజేసేందుకు వేదిక స్థలాన్ని, వీఐపీల కోసం ఏర్పాటు చేసే గ్యాలరీలను ఈఓ సోమవారం సివిల్ విభాగం అధికారులతో కలిసి పరిశీలించారు. ఉత్తర మాడ వీధిలో స్వామి వారిని అధిష్టింపజేయడానికి 16 మీటర్ల వెడల్పు, 12 మీటర్ల పొడవుతో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేయనున్నారు. ఉత్తర ద్వార దర్శనానికి వచ్చే వీఐపీలకు రెండు గ్యాలరీలు, మీడియాకు ఒకటి, భక్తుల కోసం మరో 5 గ్యాలరీలను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా పారాయణీకులు, అర్చకులకు ప్రత్యేక వేదికను సైతం ఏర్పాటు చేస్తారు. వైకుంఠ ఏకాదశి రోజున స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు సైతం రూ.150 టిక్కెట్ క్యూలైన్ నుంచి మరో ప్రత్యేక క్యూలైన్‌ను అధికారులు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment