ఆత్మకూర్(ఎస్): మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో గల బాలికల హాస్టల్‌లో రాత్రివేళ ఆకతాయిలు గోడలు దూకుతూ భయాందోళనకు గురిచేస్తున్నారు. రాత్రిపూట విద్యార్థినులకు అండగా ఉండాల్సిన వార్డెన్, ఏఎన్‌ఎం విధులకు సక్రమంగా హాజరుకాకపోవడంతో పాటు నైట్ వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రైవేట్ వ్యక్తి కూడా పట్టించుకోకపోవడంతో ఆకతాయిలు పెచ్చుమీరుతున్నారు. సుమారు వంద మంది బాలికలు హాస్టల్‌లో ఉంటుండగా.. సిబ్బంది సక్రమంగా విధులకు హాజరుకాకపోవడంతో ఆకతాయిలు ఇష్టానుసారంగా హాస్టల్‌లోకి చొరబడుతున్నారని బాలికల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. హాస్టల్‌లోకి బయటి వ్యక్తులు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చిపోతుండడంతో తమ పిల్లలకు రక్షణ లేదనే భావనతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను హాస్టల్ నుంచి తీసుకుపోవడానికి సిద్ధమవుతున్నారు. కొందరు యువకులు హాస్టల్‌లోకి చొరబడ్డ విషయమై ఉపాధ్యాయులకు తెలియడంతో ఇటీవల పలువురు విద్యార్థినులను, యువకులను మందలించినట్లు తెలిసింది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి విధుల్లో అలసత్వం వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బాలికల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై ఎంఈఓ ధారాసింగ్‌ను వివరణ కోరగా బాలికల హాస్టల్ కేజీబీవీ ఎస్‌ఓ ఆధీనంలో ఉందని, ప్రస్తుతం వారు సమ్మెలో ఉన్నారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన విషయం తన దృష్టికి రాలేదని అన్నారు.
రాత్రివేళ వసతి గృహం గోడ
దూకుతున్న ఆకతాయిలు
విధి నిర్వహణలో వార్డెన్,
ఏఎన్‌ఎం అలసత్వం
Comments
Please login to add a commentAdd a comment