చెస్ పోటీలో ఏడేళ్ల చిన్నారి ప్రతిభ
మిర్యాలగూడ అర్బన్: చెస్ పోటీలో మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఏడేళ్ల చిన్నారి బ్రిందశ్రీ ప్రతిభ చూపింది. మిర్యాలగూడ పట్టణంలోని ఐఎంఏ భవనంలో సోమవారం నోబెల్ వరల్డ్ సంస్థ అనుమతితో అంతర్జాతీ చెస్ క్రీడాకారుడు అరవింద్ న్యాయ నిర్ణేతగా రెండు నిమిషాల టార్గెట్ 50 పజిల్స్‌లో చెక్‌మెట్ చెస్ పోటీ నిర్వహించారు. ఇందులో చిన్నారి బ్రిందశ్రీ పాల్గొని కేవలం నిమిషం 49 సెకండ్ల వ్యవధిలో 50 పజిల్స్‌లో చెక్‌మెట్ పెట్టి సత్తా చాటింది. ఈ పోటీని వీడియో రికార్డు చేసి మెయిల్ ద్వారా నోబెల్ వరల్డ్ సంస్థకు పంపించామని ఇంటర్ నేషనల్ చెస్ క్రీడాకారిణి మాశెట్టి దివ్యశ్రీ తెలిపారు. బ్రిందశ్రీకి ప్రతిభను గుర్తించిన స్థానిక ఐఎంఏ ప్రతినిధులు ఆమెకు సర్టిఫికెట్ అందజేశారు. చిన్నారిని ఐఎంఏ అధ్యక్షుడు సతీష్‌కుమార్, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ మాశెట్టి శ్రీనివాస్, కర్నాటి రమేష్, వనిత, గీత, సైదులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment