నాలుగు కొత్త పథకాలు
రిపబ్లిక్ దినోత్సవం రోజు నుంచిఅమలుకు సన్నాహాలు
అర్హులకే రైతుభరోసా..
రైతుభరోసా పథకం కింద ఏటా ఎకరానికి రూ.12 వేలు పంట పెట్టుబడి సాయంగా ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే రైతుభరోసా వర్తించనుంది. గతంలో 2,71,590 మంది రైతులకు రైతుబంధు సాయం అందేది. సాగు యోగ్యమైన భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గనుంది.
నిబంధనలు : హెచ్‌ఎండీఏ, వైటీడీఏ, లే అవుట్‌లు, వ్యవసాయేతర భూములు, అక్రమ లేఅవుట్‌లు, ఎల్‌ఆర్‌ఎస్ డేటా, పరిశ్రమల భూములు, రోడ్లు, కాలువలు, ప్రజాప్రయోజనాల కోసం సేకరించిన భూములు, వాణిజ్య భూములు, గోదాములు, కంపెనీలు, కొండలు, పెద్ద బండరాళ్లు కలిగిన భూములకు రైతుభరోసా ఇవ్వరు. ఇందుకు సంబంధించి ప్రత్యేక బృందాలు డేటా సేకరణ సర్వే నంబర్ల మార్కింగ్ చేస్తారు.
సాక్షి, యాదాద్రి : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా మరో నాలుగు నూతన పథకాలను ప్రారంభించనుంది. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ఈనెల 26నుంచి అమలు చేయనుంది. ఇందుకోసం అర్హులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు గురువారం నుంచి 20వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టనున్నాయి. 21నుంచి 24వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. 25న జిల్లా ఇంచార్జి మంత్రి లబ్ధిదారుల జాబితాను ఆమోదించనున్నారు. 26నుంచి పథకాలు అమలుకానున్నాయి.
కుటుంబ సర్వే ప్రామాణికంగా రేషన్ కార్డులు
ప్రభుత్వం ఇటీవల ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టింది. సర్వేలో రేషన్ కార్డులు లేని కుటుంబాల వివరాలు సేకరించి యాప్‌లో నమోదు చేసింది. వీటిని మున్సిపాలిటీ స్థాయిలో మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయిలో ఎంపీడీఓలు పరిశీలిస్తారు. జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్, జిల్లా పౌరసరఫరాల అధికారి పర్యవేక్షిస్తారు. వీరు ఆమోదముద్ర వేసిన అనంతరం జాబితాలను గ్రామ పంచాయతీ కార్యాలయాలు, మున్సిపాలిటీల్లోని వార్డుల్లో ప్రదర్శిస్తారు. ఇప్పటికే రేషన్ కార్డులు కలిగిఉంటే చేర్పులు, మార్పులకు అవకాశం కల్పించారు.
అర్హతలు : గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.50 లక్షల లోపు, పట్టణాల్లో రూ.2 లక్షలు ఉండాలి. తరి 3.5 ఎకరాల లోపు, మెట్ట 7.5 ఎకరాల లోపు ఉండాలి.
ఏడాదికి రూ.12వేల ఆర్థిక సాయం
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమి లేని రైతు కూలీలకు కు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అందనుంది. ఆరు నెలలకు రూ.6 వేల చొప్పున రెండు విడుతల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు.
అర్హతలు : భూమిలేని వ్యవసాయ కార్మిక కుటుంబాలకు చెందిన వ్యక్తులు 2023 – 24 సంవత్సరంలో కనీసం 20 రోజులు ఉపాధిహామీ పథకంలో పని చేసి ఉండాలి. కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుంటారు. గ్రామసభలు నిర్వహించి జాబితాలు ప్రదర్శిస్తారు. జాబితాలపై అభ్యంతరాలను ఎంపీడీఓలు పరిశీలిస్తారు. కాగా గత ఏడాది సుమారు 90 వేల మంది కార్మికులు, 20రోజుల పనిదినాలు నమోదయ్యాయి. కుటుంబాల వారీగా సంఖ్య తేలాల్సి ఉంది.
ఇందిరమ్మ ఇళ్లు
ఇందిరమ్మ పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరయ్యాయి. ఇంటి నిర్మాణం కోసం ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలు, బీసీలు, ఇతరులకు రూ.5 లక్షలు విడుతల వారీగా ప్రభుత్వం ఇవ్వనుంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం జిల్లాలో లక్షా 10వేల మంది ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల నిర్వహించిన ఇంటింటి సర్వేలో 97 దరఖాస్తులను క్షేత్రస్థాయిలో సర్వే చేసి సుమారు 50 వేల మందిని అర్హులుగా గుర్తించారు. విడతల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేసి కలెక్టర్ లాగిన్‌లో పొందుపరుస్తారు.
ఫ ఇల్లు లేని నిరుపేదలకు
ఇందిరమ్మ ఇల్లు
ఫ వ్యవసాయ కూలీలకు
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా
ఫ అర్హులందరికీ నూతన రేషన్ కార్డులు.. చేర్పులు, మార్పులకు అవకాశం
ఫ సాగు భూములకే రైతుభరోసా
ఫ అర్హులను గుర్తించేందుకు
నేటినుంచి 20వ తేదీ వరకు సర్వే
సర్వే పారదర్శకంగా చేపట్టాలి
భువనగిరి, ఆలేరు రూరల్, యాదగిరిగుట్ట రూరల్, మోటకొండూరు, రాజాపేట : భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, మోటకొండూరు తహసీల్దార్ కార్యాలయాలను బుధవారం కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇందిరమ్మ ఇళ్లు రికార్డులు, రైతుభరోసా పేపర్ వర్క్‌ను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అర్హులను ఎంపిక చేసేందుకు క్షేత్రస్థాయిలో నేటినుంచి చేపట్టనున్న సర్వే పాదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్లాట్లు చేసిన వ్యవసాయ భూములను, గుట్టలు, బండరాళ్లు, ఇతర సాగు యోగ్యం లేని భూములను రైతుభరోసా రికార్డుల నుంచి తొలగించాలని సూచించారు. సేకరించిన వివ రాలను తప్పులు లేకుండా డేటా ఎంట్రీ చేయాల ని స్పష్టం చేశారు. అదే విధంగా రాజాపేట రైతువేదికలో అధికారుల సమవేశానికి కలెక్టర్ హాజరై నూతన పథకాలకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు శ్రీకాంత్‌రెడ్డి, శాంతిలాల్, అంజిరెడ్డి, దామోదర్, ఆలేరు మున్సిపల్ కమిషనర్ లక్ష్మి, ఏఓలు రమాదేవి, సుధారాణి, డీటీ జయమ్మ, నర్సిహరావు, సీనియర్ అసిస్టెంట్ ప్రదీప్, సర్వేయర్ శివ, ఏఈఓలు దేవరకొండ శివాణి, సంధ్య, ప్రణయ్, రాజాపేట మండల ప్రత్యేకాధికారి శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment