99 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ బ్రేక్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: పంచాయతీ కార్యదర్శులు ఎలాంటి అనుమతి లేకుండా నెలల తరబడి విధులకు గైర్హాజరు కావడంతో వారి సర్వీస్‌ను బ్రేక్ చేస్తూ నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. వారిని తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు అనుమతి ఇచ్చి వివిధ ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చారు. జిల్లాలోని వివిధ గ్రామాల్లో పనిచేసే 99 మంది కార్యదర్శులు ఉన్నతాధికారుల నుంచి అనుమతులు లేకుండా రెండు నెలల నుంచి 11 నెలల పాటు (ఒక్కొక్కరు ఒక్కో రకంగా) విధులకు గైర్హాజరు అయ్యారు. గత నెలలో వారంతా విధుల్లో చేరేందుకు కలెక్టర్‌ను సంప్రదించగా ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు.
అనుమతి లేకుండా గైర్హాజరు
గ్రామాల్లో ఇప్పటికే సర్పంచులు లేరు. కార్యదర్శులు కూడా లేకపోతే గ్రామ పాలన పూర్తిగా ఆగిపోయే పరిస్థితి నెలకొంది. గ్రూపు–1 గ్రూపు–2 పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు చాలా మంది పంచాయతీ కార్యదర్శులు విధులకు కొన్ని నెలలుగా గైర్హాజరయ్యారు. వాస్తవానికి వారు ముందస్తుగా ఉన్నాధికారుల అనుమతి తీసుకొని, సెలవు పెట్టాలి. కానీ, వారు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా.. సెలవు పెడుతున్నట్లు ఒక పేపరుపై రాసి కార్యాలయంలో ఇచ్చి వెళ్లిపోయారు. ప్రస్తుతం వారంతా విధుల్లో చేరేందుకు వచ్చారు. అయితే 99 మంది కార్యదర్శుల గైర్హాజరు కాలానికి సంబంధించిన సర్వీస్‌ను బ్రేక్ చేస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. వారంతా విధుల్లో చేరేందుకు ఉత్తర్వులు ఇస్తూ వారికి పాత స్థానాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చారు. సర్వీస్ బ్రేక్ చేయడంతో గైర్హాజరైన కాలానికి సంబంధించి సర్వీస్ అంతా కోల్పోవాల్సి వస్తుంది. బ్రేక్ కాలాన్ని సర్వీస్ బుక్‌లో రాయడం వల్ల భవిష్యత్‌లో సర్వీస్ రెగ్యులరేజేషన్, ఇంక్రిమెంట్లు, పెన్షన్ల తదితర వాటిల్లో వారికి నష్టం జరిగే అవకాశం ఉంది.
నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి సంచలన నిర్ణయం
ఫ అనుమతి లేకుండా నెలల తరబడి
విధులకు గైర్హాజరు
ఫ విధుల్లో చేరేందుకు అనుమతి,
వివిధ ప్రాంతాల్లో పోస్టింగ్
ఫ సర్వీస్ బ్రేక్‌తో రెగ్యులరైజేషన్,
ఇంక్రిమెంట్లలో నష్టపోనున్న కార్యదర్శులు
Comments
Please login to add a commentAdd a comment