గుండాల మండల కేంద్రంలో సర్వేలో సేకరించిన వివరాలపై కలెక్టర్ ఆరా తీశారు. ఇందిరమ్మ ఇళ్ల సూపర్ చెక్ పూర్తి చేశారా? మరణించిన వారి పేర్లు తొలగించారా? అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమన్వయంతో సర్వే పూర్తి చేయాలని సూచించారు. ఈ నెల 20 వరకు సర్వే పూర్తి చేసి ఫార్మాట్‌లో వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఆత్మకూర్(ఎం) మండల ప్రత్యేకాధికారి రాజారాం, తహసీల్దార్లు రవికుమార్, జలకుమారి, రాంప్రసాద్, ఎంపీడీఓ బాలాజీ, డిప్యూటీ తహసీల్దార్ షఫీయోద్దీన్, ఆర్‌ఐ మల్లికార్జునరావు, ఏఓ అపర్ణ, ఏఈఓలు మనీష, సౌమ్య, క్రాంతి, ఎంఆర్‌ఐ అనసూర్య, సర్వేయర్ సుష్మ, ఇన్‌చార్జి ఈఓపీఆర్డీ ధనుంజయ్, జూనియర్ అసిస్టెంట్ ప్రభాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment