నేటి నుంచి జానియర్ కళాశాలలు పునఃప్రారంభం
భువనగిరి : జూనియర్ కళాశాలలు శుక్రవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 11 నుంచి 16వ తేదీ వరకు ఇంటర్‌బోర్డు సెలవులు ప్రకటించింది. సెలవులు ముగియడంతో నేటినుంచి విద్యార్థులు కళాశాల బాట పట్టనున్నారు. అదే విధంగా పాఠశాలలకు శుక్రవారంతో సంక్రాంతి సెలవులు ముగియనున్నాయి. 18 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
అర్హులందరికీ రైతుభరోసా
యాదగిరిగుట్ట రూరల్ : అర్హత కలిగిన ప్రతి రైతుకు రైతుభరోసా వస్తుందని, అధైర్యపడవద్దని జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ పేర్కొన్నారు. గురువారం యాదగిరిగుట్ట మండలం సాధువెల్లిలో చేపట్టిన సర్వేను ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సాగుకు యోగ్యంకాని రాళ్లు, రప్పలు, లే అవుట్‌లు కలిగిన స్థలాలకు రైతుభరోసా రాదన్నారు. అనర్హుల జాబితాను ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు. ఆయన వెంట ఏఓ సుధారాణి, ఆర్‌ఐ విజయసింహారెడ్డి, ఏఈఓ ప్రణయ్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి ఉన్నారు.
తడి, పొడి
చెత్త బుట్టలు పంపిణీ
భువనగిరి : దాతల సహకారాన్ని సద్విని యోగం చేసుకోవాలని జెడ్పీ సీఈఓ శోభా రాణి, డీఆర్‌డీఓ నాగిరెడ్డి సూచించారు. గురువారం భువనగిరి మండలం తాజ్‌పూర్‌లో ర్యాకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమకూర్చిన 700 తడి, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేసి మాట్లాడారు. గ్రామాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చెత్తను బహరంగ ప్రదేశాల్లో వేయకుండా బుట్టల ద్వారా తడి, పొడి చెత్తను వేర్వేరుగా పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సీహెచ్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ బొమ్మారపు సురేష్, మాజీ ఉప సర్పంచ్ ర్యాకల సంతోష, వార్డుసభ్యులు పాల్గొన్నారు.
పెరటికోళ్ల పెంపకంపై
అవగాహన
వలిగొండ : మండలంలోని ఆరూర్ గ్రామాన్ని గురువారం హైదరాబాద్‌లోని జాతీయ మాంస పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు, అధికారులు సందర్శించారు. మహిళలకు పెరటికోళ్ల పెంపకంపై అవగాహన కల్పించారు. అనంతరం కోడి పిల్లలు, దాణ, నీటి తొట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త బసవారెడ్డి, పశు వైద్యాధికారులు రామ్మోహన్‌రెడ్డి, శ్రీనివాస్, గోపిరెడ్డి పాల్గొన్నారు.
పెహచాన్ కార్డుల పంపిణీ
భూదాన్‌పోచంపల్లి : పట్టణంలోని టై అండ్ డై సిల్క్ చీరల ఉత్పత్తిదారుల సంఘం కార్యాలయంలో గురువారం చేనేత కార్మికులకు పెహచాన్ కార్డులు (గుర్తింపుకార్డు)లను వీవర్ సర్వీస్‌సెంటర్ అధికారులు పుల్లయ్య, బిస్వంత్ మహాలి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో దరఖాస్తు చేసుకుని కార్డులు రాని చేనేత కళాకారులందరికీ పెహచాన్ కార్డులు అందజేస్తామన్నారు. ఈ కార్డుల ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలకు అర్హులుగా పరిగణించబడుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టై అండ్ డై అసోషియేషన్ అధ్యక్షుడు భారత లవకుమార్, గౌరవ అధ్యక్షుడు కర్నాటి బాలరాజు, రాపోలు శ్రీనివాస్, సూరెపల్లి రవీందర్, భారత భూషణ్, ఈపూరి ముత్యాలు, గంజి బాలరాజు, వనం దశరథ, సీత సుధాకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment