బీపీ, షుగర్ పెరుగుతోంది!
భువనగిరి : జిల్లాలో అసంక్రమిత వ్యాధిగ్రస్తులు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. మారిన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలతో మధుమేహం (షుగర్), రక్తపోటు(బీపీ) వేగంగా విస్తరిస్తోంది. జిల్లాలో బీపీ, షుగర్ బాధితులు 90వేలకు పైనే ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్‌సీడీ) సర్వేలో తేలింది. బాధితుల్లో యువత సైతం అధిక సంఖ్యలో ఉండడం ఆందోళన కలిగించే విషయం. శారీరకంగా శ్రమించే వారు సైతం బీపీ, షుగర్ భారిన పడుతున్నారు. ప్రారంభంలోనే నియంత్రించుకోవాల్సి ఉన్నా నిర్లక్ష్యం చేస్తుండడంతో వ్యాధులు ముదురే వరకు చూసి వైద్యులను అశ్రయిస్తున్నారు.
షుగర్ బాధితులు అధికం
జిల్లాలో 7.30 లక్షల జనాభా ఉండగా అందులో 30 సంవత్సరాల పైబడిన వారు 4,55,254 మంది ఉన్నారు. ఇటీవల ఎన్‌సీడీ సర్వే చేయగా బీపీ 56,519, షుగర్‌తో 27,967 మంది బాధపడుతున్నట్లు అధికారిక గణాంకాల ప్రకారం తేలింది. బీపీ బాధితులతో పోలిస్తే షుగర్ వ్యాధిగ్రస్తులు రెండింతలు ఉన్నారు. షుగర్ దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.చక్కెర స్థాయిలను నియంత్రించుకోవడంతో పాటు క్రమంతప్పకుండా మందులు వేసుకోవడం, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం సమయానికి తీసుకోవడం, బరువును అదుపులో ఉంచుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు.
జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ప్రత్యేక క్లీనిక్
భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ప్రత్యేక క్లీనిక్‌లో అసంక్రమిత వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందజేస్తున్నారు. ఇక్కడ స్పెషలిస్టు వైద్యులు నిత్యం అందుబాటులో ఉంటారు. వీరు రోగులను పరిశీలించి మందులు అందజేస్తారు. వీటితో పాటు ఆహార నియమాలు, పాటించాల్సిన జాగ్రత్తల గురించి సలహాలు, చూచనలు చేస్తారు.
జిల్లాలో 90 వేలకు పైనే బాధితులు
ఎన్‌సీడీ సర్వేలో గుర్తింపు
పల్లెల్లోనూ విస్తరిస్తున్న
అసంక్రమిత వ్యాధులు
ప్రత్యేక కేంద్రాల ద్వారా చికిత్స
వైద్యుల సూచనలు పాటించాలి
బీపీ, షుగర్ ఉన్న వారు క్రమం తప్పకుండా పరీక్షలు చేసుకోవాలి.అసంక్రమిత వ్యాధిగ్రస్తులకు జిల్లా వ్యాప్తంగా ఎన్‌సీడీ కిట్లు అందించి వారి ఆరోగ్య పరిస్థితిని ఆశా కార్యకర్తల ద్వారా గమనించబడుతుంది. మారిన జీవనశైలి, ఆహారం అలవాట్లతో పాటు శారీరక శ్రమ తగ్గడం వల్ల బీపీ, షుగర్ బారిన పడుతున్నారు.
– డాక్టర్ మనోహర్, డీఎంహెచ్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment