గడువులోపు సర్వే పూర్తి చేయాలి
బీబీనగర్ : నూతన పథకాలపై చేపట్టిన సర్వే గడువులోపు పూర్తి చేసి డేటా ఎంట్రీ చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి సూచించారు. గురువారం బీబీనగర్ మండల కేంద్రంలో సర్వే బృందాలతో సమావేశం అయ్యారు. రైతుభరోసా, రేషన్‌కార్డు పథకాలకు సంబంధించి సర్వే తీరును పర్యవేక్షించి సూచనలు చేశారు. అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సర్వే కొనసాగాలని పేర్కొన్నారు. రేషన్‌కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల్లో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారినే గుర్తించాలన్నారు. భూములు, ఆదాయ వివరాలను తప్పులు లేకుండా ఫార్మాట్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. సాగుయోగ్యమైన భూములకు మాత్రమే రైతుభరోసా వర్తింపజేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, తహసీల్దార్, ప్రత్యేకాధికారి, ఏఓలు, ఏఈఓలు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ వీరారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment