పథకాలు అర్హులకే అందాలి
ఆత్మకూరు(ఎం), గుండాల, మోత్కూరు : రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26నుంచి కొత్తగా అమలు చేయబోయే పథకాలు అర్హులకే అందేలా సర్వే పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. గురువారం ఆయన ఆత్మకూరు(ఎం) మండలంలోని రాయిపల్లి, కప్రాయపల్లి, గుండాల, మోత్కూరు మండలం ముశిపట్ల పంచాయతీ పరిధి శివనగర్‌ను సందర్శించారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సర్వేను పర్యవేక్షించారు. తొలుత రాయిపల్లిలో రైతుభరోసా రికార్డులను పరిశీలించడంతో పాటు రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారితో మాట్లాడారు. వ్యవసాయ భూమి ఉందా? ఎక్కడ నివాసం ఉంటున్నారని? వివరాలు అడిగారు. అనంతరం కప్రాయపల్లిలో రైతుభరోసా సర్వే వివరాలు తెలుసుకున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన అక్రమ లేవుట్‌ను పరిశీలించారు. లేఅవుట్‌ను తొలగించాలని, అమ్మకాలు, కొనుగోలు చేయరాదంటూ బోర్డు ఏర్పాటు చేయాలంటూ పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. గ్రామంలో పట్టపగలు వీధి దీపాలు వెలుగుతుండడం గమనించి ఆన్ ఆఫ్ స్విచ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ తరువాత ఇండియన్ ఆయిల్ పెట్రోల్‌బంక్ స్థలాన్ని పరిశీలించారు. పెట్రోల్‌బంక్ స్థలాన్ని రైతుభరోసా నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ హనుమంతరావు
Comments
Please login to add a commentAdd a comment