సుందరయ్య జీవితం ఆదర్శనీయం
రామన్నపేట : పుచ్చలపల్లి సుందరయ్య రాజకీయ జీవితం ఆదర్శనీయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. రామన్నపేట మండలం శోభనాద్రిపురంలో సీపీఎం గ్రామశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుచ్చపల్లి సుందరయ్య విగ్రహాన్ని గురువారం ఆయన ఆవిష్కరించారు. అదే విధంగా కొండకింది శ్రీనివాస్‌రెడ్డి స్మారకభవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా, తెలంగాణ సాయుధ పోరాట సారథిగా తన జీవితాన్ని పేదలకు అంకితం చేసిన మహనీయుడు సందరయ్య అని కొనియాడారు. యువత సుందరయ్యను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ శోభనాద్రిపురం ఉద్యమాలకు కేంద్రబిందువుగా ఉండేదని, సుందరయ్య సారథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పార్టీ రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించినట్లు గుర్తు చేశారు. నాటి ఉద్యమ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అంతకుముందు కళాకారులు ఆటాపాటలతో, మహిళలు బతుకమ్మలు, కోలాటాలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు బొంతల చంద్రారెడ్డి, పైళ్ల ఆశయ్య, కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, ఎండీ జహంగీర్, మేక అశోక్‌రెడ్డి, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, బూరుగు క్రిష్ణారెడ్డి, బొడ్డుపల్లి వెంకటేశం, పబ్బతి లింగయ్య, బొడిగె బసవపున్నయ్య, ఎండీ రశీద్, బొడిగె రజిత, కొమ్ము అంజమ్మ, అంజయ్య, సంగి లింగస్వామి, ఎర్ర సాయిలు, పాలకూరి నర్సింహ, లతీఫ్, సుదర్శన్, మల్లేశం, రవి తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
తమ్మినేని వీరభద్రం
Comments
Please login to add a commentAdd a comment