సిమెంట్ పరిశ్రమ ఏర్పాటును ఆపించండి
రామన్నపేట : మండల కేంద్రంలో అదానీ సంస్థ ఏర్పాటు చేయతలపెట్టిన అంబుజా సిమెంట్ పరిశ్రమను నిలిపివేయించాలని రామన్నపేట అఖిలపక్ష నాయకులు ఎమ్మెల్యే వేముల వీరేశంను కోరారు. పర్యావరణ పరిరక్షణ వేదిక, అఖిలపక్షం ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మెల్యేను నకిరేకల్‌లో ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేయడం వల్ల రామన్నపేట ప్రాంతంలో పర్యావరణంతో పాటు ప్రజారోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి ప్రజాభిప్రా యం మేరకు సిమెంట్ పరిశ్రమను నిలిపివేయించాలని కోరారు. తనకు ప్రజా శ్రేయస్సే ముఖ్యమని, సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు కాకుండా తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్‌రెడ్డి, పర్యావరణ పరిరక్షణ వేదిక కన్వీనర్ జెల్లెల పెంటయ్య, కోకన్వీనర్ ఎండీ రెహాన్, వివిధ పార్టీల నాయకులు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, బండ మధుకర్‌రెడ్డి, ఊట్కూరి నర్సింహ, ఫజల్‌బేగ్, కందుల హనుమంత్, ఎండీ నాజర్, బొడ్డు సురేందర్, శంకర్, ఎర్ర శేఖర్, ఆముద లక్ష్మణ్, గోదాసు శివనారాయణ, కూనూరు క్రిష్ణ, గొరిగె సోములు, రాపోలు ప్రభాకర్, బోయపల్లి గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment