ఆత్మకూరు(ఎం) : పల్లెవెలుగు బస్సులను ఎక్స్‌ప్రెస్ సర్వీస్ పేరుతో నడుపుతూ ప్రయాణికుల జేబుకు చిల్లు పెడుతోంది.. ఆర్టీసీ. సీటింగ్ మార్చకుండా, వేగం పెంచకుండానే స్పెషల్ బాదుడు బాదుతోంది. సంక్రాంతి పండుగకు ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. సాధారణ రోజుల్లో మోత్కూరు నుంచి ఉప్పల్‌కు రూ.140లు చార్జి తీసుకుంటారు. ప్రత్యేక బస్సులు అంటూ రూ.200 వసూలు చేస్తున్నారు. అదనంగా రూ.60 తీసుకుంటున్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు. కాగా తిరుగుపయనంలోనూ ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. పల్లెవెలుగు బస్సులకు ఎక్స్‌బోర్డు తగిలించి అధిక చార్జి తీసుకోవడంతో కండక్టర్లతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగుతున్నారు. బుధవారం ఆత్మకూర్(ఎం) రూట్‌లో ఇటువంటి దృశ్యాలు కనిపించాయి.
అధిక చార్జి తీసుకున్నారు
మా కుటుంబ సభ్యులమంతా హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో నివాసం ఉంటాం. సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చాను. మామూలు రోజుల్లోకంటే ఎక్కువ చార్జి తీసుకున్నారు. –యశోధ, ఆత్మకూర్(ఎం)
ఫ పల్లెవెలుగులకు బోర్డులు మార్చి
నడుపుతున్న ఆర్టీసీ
ఫ కండక్టర్లతో ప్రయాణికుల వాగ్వాదం
Comments
Please login to add a commentAdd a comment