యువత సన్మార్గంలో పయనించాలి
రామన్నపేట : యువత సన్మార్గంలో పయనించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ సూచించారు. సంక్రాంతి సందర్భంగా డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ, వాలీబాల్, ముగ్గులు, సాంస్కృతిక పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేసి మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాధక ద్రవ్యాలకు బానిసలు కావద్దన్నారు. యువతలో క్రీడా నైపుణ్యం వెలికితీయడానికి క్రీడా పోటీలు దోహదపడుతాయన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దేవిరెడ్డి సావిత్రమ్మ, నాయకులు బొడ్డుపల్లి వెంకటేశం, నోముల రమేష్, మేకల వరుణమ్మ, కృష్ణయ్య, జంపాల అండాలు, గంటెపాక శివ, తాళ్లపల్లి జితేందర్, తొల్పునూరి చంద్రశేఖర్, బూడిద భిక్షం, జోగుల శ్రీనివాస్, ఉండ్రాతి నర్సింహ, జంపాల ఉమాపతి, పులిపలుపుల నాగార్జున, కుక్కడపు స్వామి, ధనలక్ష్మీ, హేమలత, ధనమ్మ, భాషయ్య, సాయికుమార్, సందీప్, ఉపేందర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
25 నుంచి సీపీఎం
రాష్ట్ర మహాసభలు
భూదాన్‌పోచంపల్లి : సంగారెడ్డి పట్టణంలో ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు సీపీఎం నాలుగో రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ తెలిపారు. బుధవారం భూదాన్‌పోచంపల్లిలోని సీపీఎం కార్యాయలంలో రాష్ట్ర మహాసభల వాల్‌పోస్టర్‌ను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాసభల్లో భాగంగా మొదటి రోజు నిర్వహించే ప్రదర్శన, బహిరంగ సభకు కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకారత్, బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారని పేర్కొన్నారు. పార్టీ, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, కార్మికులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి కోట రాంచంద్రారెడ్డి, నాయకులు మంచాల మధు, వడ్డేపల్లి యాదగిరి, బుగ్గ లక్ష్మయ్య, పొనమోని కృష్ణ, రామసాని అనిల్‌రెడ్డి, యాదగిరి, షేక్ అలీ, మూశం శివ, నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
అర్హులనే గుర్తించండి
భూదాన్‌పోచంపల్లి : రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26నుంచి అమలు చేయనున్న నూతన పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు క్షేత్రస్థాయి సర్వే పారదర్శకంగా చేపట్టాలని భూదాన్‌పోచంపల్లి మండల ప్రత్యేకాధికారి, డీపీఓ సునంద సూచించారు. బుధవారం భూదాన్‌పోచంపలి ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమావేశమై ఇందిరమ్మ ఇళ్లు, రైతభరోసా, ఇందిరమ్మ ఆత్మీయభరోసా, కొత్త రేషన్‌కార్డు పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయడంలో పాటించాల్సిన మార్గదర్శకాలపై సూచనలు చేశారు. అర్హులను మాత్రమే గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భాస్కర్, ఇంచార్జ్ తహసీల్దార్ నాగేశ్వర్‌రావు, మండల వ్యవసాయాధికారిణి శైలజ, ఎంపీఓ మాజిద్, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థులకు అభినందనలు
యాదగిరిగుట్ట : జాతీయస్థాయిలో ఉత్తమ ఎగ్జిబిట్ రూపొందించిన విద్యార్థులను గ్రామస్తులు అభినందించారు. తుర్కపల్లి మండలం రాంపూర్‌తండా పాఠశాల విద్యార్థులు రూపొందించిన చార్జింగ్ ఎలక్ట్రిక్ నానో ట్రాక్టర్ ప్రాజెక్టును ఢిల్లీలో నిర్వహించిన జాతీయస్థాయి వికసిత్ భారత్ సైన్స్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. ఈ ప్రాజెక్టు ఉత్తమ ఎగ్జిబిట్‌గా ఎంపికైంది. విద్యార్థులు లూనావత్ అఖిల్, భానోతు తరుణ్‌కు తండావాసులతో పాటు ఉపాధ్యాయ బృందం ఒక ప్రకటనలో అభినందనలు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment