సమృద్ధిగా నీరు.. వరిదే జోరు
సాక్షి, యాదాద్రి : సాగునీరు సమృద్ధిగా ఉండడంతో యాసంగి సాగు ఉత్సాహంగా సాగుతోంది. జిల్లాలో 2.90 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు 2.50 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. ఇందులో అత్యధికంగా 90 శాతం దొడ్డురకం కాగా, సన్నాలు కేవలం 10 శాతం మాత్రమే సాగు చేశారు. మూసీకి గోదావరి జలాలు తోడవడంతో రైతులు వరి వైపు ఎక్కువగా మొగ్టు చూపారు.
నాన్ ఆయకట్టులో పెరిగిన భూగర్భ జలాలు
మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్, నవాబు పేట రిజర్వాయర్ల ద్వారా ఆలేరు, రాజాపేట, యాదగిరిగుట్ట, మోటకొండూరు, ఆత్మకూర్ (ఎం), తుర్కపల్లి మండలాల్లోని చెరువుల్లోకి నీరు చేరుతోంది. అంతేకాకుండా బిక్కేరు, ఆలేరు పెద్దవాగులోకి సైతం గోదావరి జలాలను వదలడంతో భూగర్భ జలాలు పైకొచ్చాయి. దీంతో రైతులు వరి వైపు మొగ్గు చూపారు.
వలస కూలీల రాకతో తీరిన సమస్య
ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి నాట్లు వేస్తున్నారు. స్థానికంగా కూలీల కొరత వేదిస్తుండగా.. వలస కూలీల రాకతో సమస్య తీరింది. అయితే కూలీలు, పెట్టుబడులకు ఖర్చులు పెరిగినట్లు రైతులు చెబుతున్నారు.
‘గోదావరి’తో సస్యశ్యామలం
నాన్ ఆయకట్టు ప్రాంతమైన ఆలేరు నియోజ కవర్గం గోదావరి జలాలతో సస్యశ్యామలం అవుతోంది. ఆలేరు మండలంలో 11,500 ఎకరాల్లో వరి సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు 10,400 ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. గొలనుకొండ, కొలనుపాక మంతపురి, శారాజీపేట, కొలనుపాక తదితర గ్రామాల్లో వారం రోజుల్లో పూర్తవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
మూసీ ఆయకట్టులో పచ్చదనం
మూసీ ఆయకట్టులో ఇప్పటికే నాట్లు పూర్తయ్యాయి. ముఖ్యంగా భూదాన్‌పోచంపల్లి మండలంలో వరినాట్లు దాదాపు పూర్తి కావడంతో ఎక్కడ చూసినా పచ్చదనం కనిపి స్తోంది ఈ మండలంలో 26,550 ఎకరాల్లో వరి సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. సాగునీరు సమృద్ధిగా ఉండడంతో 98 శాతం నాట్లు పూర్తయ్యాయి.
మూసీకి తోడు గోదావరి జలాలు
2.50 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తి
2.90 లక్షల ఎకరాలకు
చేరుతుందని అంచనా
నెలాఖరుకు ముగియనున్న నాట్లు
Comments
Please login to add a commentAdd a comment