లక్షుమ్మ(ఫైల్)
సిద్దవటం : మండలంలోని వెంకటాయపల్లె గ్రామ సమీపంలోని పెన్నానది నీటిలో గుర్తు తెలియని వ్యక్తి మృత దేహం(48) లభ్యమైనట్లు ఎస్‌ఐ లక్ష్మీనారాయణ తెలిపారు. మృతదేహాన్ని వెలికి తీసి అక్కడే పోస్టుమార్టం నిర్వహించామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
సగిలేరు నదిలో పడి
మహిళ మృతి
అట్లూరు : మండల పరిధిలోని సగిలేరు నదిలో ప్రమాద వశాత్తు పడి లక్కిరెడ్డి లక్ష్మ్ము (48) అనే మహిళ మృతి చెందింది. స్థానిక ఎస్‌ఐ కేసీ రాజు వివరాల మేరకు మండల పరిధిలోని కుంభగిరి గ్రామానికి చెందిన లక్కిరెడ్డి లక్షుమ్మ మంగళవారం పొలానికి వెళ్లి రాత్రి వరకూ ఇంటికి రాక పోవడంతో బంధువులు చుట్టుపక్కలా గాలించారు. పొలాల సమీపంలో ఉన్న సగిలేరు నదిలో నీటి గుండం దగ్గర చెప్పులు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే బద్వేలు అగ్నిమాపక సిబ్బంది సహకారంతో పోలీసులు నదిలో గాలించడంతో మంగళవారం రాత్రి ఆమె మృతదేహం లభ్యమైంది. మృతురాలికి భర్తతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.
యువకుడిపై కేసు నమోదు
కాశినాయన : మండలంలోని ఆకులనారాయణపల్లె గ్రామానికి చెందిన మాచవరం చెన్నారెడ్డి అనే యువకుడిపై అదే గ్రామానికి చెందిన టి.కావేరి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడనే ఫిర్యాదుపై కేసు నమోదు చేశామన్నారు.
కువైటు నుంచి స్వగ్రామం చేరిన మృతదేహం
అట్లూరు : మండల పరిధిలోని ఎస్.వెంకటాపురం చెండువాయి కాలనీకి చెందిన ఈనరాతి పార్వతి(45)మృత దేహం కువైటు నుంచి బుధవారం తెల్లవారు జామున స్వగ్రామం చేరింది. మృతురాలి బంధువుల వివరాల మేరకు.. పార్వతి బతుకు దెరువు కోసం మూడేళ్ల క్రితం కువైటుకు వెళ్లింది. అక్కడ ఇంటిలో పనులు చేస్తూ ఈనెల 8వ తేదీన ప్రమాద వశాత్తు కిందపడి కోమాలోకి వెళ్లింది. చికిత్స పొందుతూ ఈనెల 11వ తేదీన మృతి చెందడంతో అక్కడ పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బుధవారం స్వగ్రామానికి తీసుకుని వచ్చారు. మృతురాలి భర్త మూడేళ్ల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. మృతురాలికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment