చీమల దాడిలో గాయపడిన డ్రైవర్ మృతి
కురబలకోట : తాగిన మైకంలో చీమల దాడికి గురైన ఆటో డ్రైవర్ ద్వారకనాథరెడ్డి (29) చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని ఎర్రమద్దివారిపల్లెకు చెందిన ద్వారకనాథ రెడ్డి(29) ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం అతిగా మద్యం సేవించి పల్లె దగ్గరున్న కొండ కింద నిద్రించారు అపస్మారక స్థితిలో ఉన్న ఇతన్ని చీమలు చుట్టు ముట్టాయి. అవి కుట్టడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన స్థానికులు మంగళవారం ఇతన్ని హుటాహుటిన మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. అక్కడ చికిత్స పొందతూ బుధవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment