●ఆరుతడి పంటలకు నష్టం
కడప అగ్రికల్చర్: ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఆరుగాలం కష్టపడి పంటల సాగు చేసుకుంటే.. అకాల వర్షాలు అన్నదాతలను కలవర పెడుతున్నాయి. జిల్లాలో చాలా చోట్ల వరి పంట పొట్ట, వెన్ను, కోత దశలో ఉంది. పలు చోట్ల నూర్పిళ్లు కూడా జరుగుతున్నాయి. అలాగే ఇటీవల చాలా మంది రైతులు శనగ, మినుము, పెసర వంటి ఆరుతడి పంటలు సాగు చేశా రు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరితోపాటు ఆరుతడి పంటల సాగు చేసిన రైతుల గుండెల్లో గుబులు పట్టుకుంది.
ఖరీఫ్‌లో..
జిల్లాలో ఖరీఫ్‌లో 70,648 ఎకరాల్లో వరి పంట సాగైంది. ముందస్తుగా వేసిన వరి పంట చాలా చోట్ల కోత దశకు చేరుకుంది. ఉన్నట్లుంటి తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలకు వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కోత కోసి ధాన్యాన్ని ఆరుబెట్టుకున్నా రు. ఈ వర్షాలకు పట్టలు కప్పి ఉంచితే వేడి వల్ల గింజ రంగు మారుతుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. అలాగే చాలా చోట్ల కొద్దిగా ఆలస్యంగా సా గు చేసిన వరి చిరుపొట్ట, గింజ దశలో ఉంది. ఈ వ ర్షాలకు చిరుపొట్టలోకి నీరు దిగి తెల్ల కంకి వస్తుందని దిగులు చెందుతున్నారు. ఏదిఏమైనా అకాల వర్షం వరి రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
బద్వేలులో అత్యధికంగా..
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో మూడు రోజుల నుంచి వర్షాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బద్వేలులో అత్యధికంగా 38.2 మి.మీ వర్షపాతం నమోదైంది. పోరుమామిళ్లలో 30.2, గోపవరం 28.4, కొండాపురం 25.2, జమ్మలమడుగు 23.4, మైలవరం 21.4, వల్లూరు 21.4, ఒంటిమిట్ట, కమలాపురం 17.4, ఎర్రగుంట్ల 16.4, ముద్దనూరు 14.2, వీఎన్‌పల్లి 14, చాపాడు 11.8, చింతకొమ్మదిన్నె, బి.కోడూరు 10.4, చెన్నూరు10.2, వేముల 10, బి.మఠం 9.8, సిద్దవటం 9.2, కలసపాడు 8.6, అట్లూరు 8.2, ఖాజీపేట 4.8, కడప 4.2, తొండూరు 3.2, కాశినాయన 3, దువ్వూరు 2.4, సింహాద్రిపురం 2.2, చక్రాయపేట 1.4, లింగాల, పెద్దముడియం 1.2, రాజుపాళెంలో 0.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
వరి, శనగ రైతుల్లో ఆందోళన
మూడు రోజులుగా కొనసాగుతున్న వాన
బద్వేలులో అత్యధికంగా 38.2 మి.మీ
ఇటీవల జిల్లాలో 20 వేల హెక్టార్ల దాకా శనగ పంట సాగు చేశారు. ఇప్పటికే చాలా మంది రైతులు సబ్సిడీతో సాగు చేసిన శనగ విత్తనలు సరిగా మొలకెత్తక ఆందోళన చెందుతున్నారు. ఇప్పడేమో ఉన్నట్లుంటి కురుస్తున్న వర్షాలకు పంట దెబ్బతింటుందని వారు దిగులు పడుతున్నారు. వీటిలోపాటు పలు మండలాల్లో పెసర, మినుము పంటలను సాగు చేశారు. ఆ రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. ముందుగా సాగు చేసుకున్న ఆరుతడి పంటలకు మాత్రం కొంత మేలని పలువురు రైతులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment