కనుల పండువగా రామయ్య కల్యాణం
ఒంటిమిట్ట : ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం కార్తిక పౌర్ణమి సందర్భంగా సీతారాముల కల్యాణం కనులపండువగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని బాలాలయం ప్రాంగణంలో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి సీతారాముల ఉత్సవ మూర్తులను ఆశీనులు చేశారు. అనంతరం ఉత్సవ మూర్తులకు పంచామృతాభిషేకాలు నిర్వహించి పట్టు వస్త్రాలు తొడిగి, తులసిపూల గజమాలతో సుందరంగా అలంకరించారు. అలంకరణ అనంతరం ఆలయ అర్చకులు శ్రావణ్ కుమార్, పవన్ కుమార్లు సీతారాముల పౌర్ణమి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment