14న జాతీయ లోక్ అదాలత్
కడప అర్బన్: జాతీయ న్యాయసేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశానుసారంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ, కడప వారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 14న (శనివారం) జాతీయలోక్ అదాలత్ నిర్వహించనున్నారు. మరింత సమాచారం కోసం 08562– 258622, 244622, ఈ మెయిల్ అడ్రస్: కడప.డికోర్ట్స్.జిఓవి.ఇన్, డిఎల్‌ఎస్‌ఎకెడిపిఅట్‌ది డేటాఫ్ జిమెయిల్ డాట్ కామ్‌లలో సంప్రదించాలని జిల్లా న్యాయసేవాధికారసంస్థ చైర్మన్, జిల్లా ప్రధానన్యాయమూర్తి జి. శ్రీదేవి, జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్.బాబా ఫకృద్దీన్ శుక్రవారం సంయుక్త ప్రకటనలో తెలియజేశారు.
18న జాబ్‌మేళా
జమ్మలమడుగు: పట్టణంలో ఈ నెల 18న న్యాక్ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు న్యాక్ అధికారి వినీల్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక ప్రొద్దుటూరు రహదారిలోని మున్సిపల్ కార్యాలయం పక్కన ఉన్న తమ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. నిరుద్యోగులు ఉదయం 10 గంటలకు అక్కడికి చేరుకోవాలన్నారు. 18–30 ఏళ్ల మధ్య ఉన్న పీజీ, డిగ్రీ, ఇంటర్మీడియెట్, పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని వివరించారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పాకా సురేష్
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పాకా సురేష్ కుమార్‌ను నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. పాకా సురేష్‌కుమార్ ప్రస్తుతం కడప నగర పాలక సంస్థలో 47వ డివిజన్ కార్పొరేటర్‌గా ఉన్నారు.
ముగిసిన ఆర్మీ
రిక్రూట్‌మెంట్ ర్యాలీ
కడప స్పోర్ట్స్: కడప నగరంలోని డీఎస్‌ఏ క్రీడామైదానం వేదికగా ఈ నెల 10 నుంచి నిర్వహించిన అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ శుక్రవారం ముగిసింది. ఆర్మీ రిక్రూట్‌మెంట్ డైరెక్టర్ కల్నల్ పునీత్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎంపికల ప్రక్రియకు రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన అభ్యర్థులు హాజరై ఫిజికల్, మెడికల్ టెస్ట్‌లలో పాల్గొన్నారు. కాగా ఎంపికల ప్రక్రియ సజావుగా సాగేందుకు జిల్లా యంత్రాంగం సంపూర్ణ సహకారం అందించింది. మొత్తం మీద ఎలాంటి ఆటంకాలు, ఘటనలు లేకుండా ప్రశాంతంగా ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ముగియడం విశేషం.
30లోగా దరఖాస్తు చేసుకోవాలి
రాయచోటి (జగదాంబసెంటర్): 2024–25 విద్యా సంవత్సరానికి పోస్ట్ మెట్రిక్ స్కాల ర్‌షిప్ కోసం అర్హులైన విద్యార్థులు నూతన, రెన్యూవల్ రిజిస్ట్రేషన్ కోసం జ్ఞానభూమి లాగిన్‌లో ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని అన్నమయ్య జిల్లా సాంఘిక సంక్షేమ, సాధికారత అధికారి ఎన్.జయప్రకాష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా లోని కళాశాల యాజమాన్యం వారి కళాశాల లోని విద్యార్థుల నూతన, రెన్యువల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెల 30లోగా పూర్తి చేయాలన్నారు. దరఖాస్తు విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత కళాశాలలో లేదా స్థానిక సచివాలయంలో లేదా జిల్లా సాంఘిక సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన తెలియజేశారు.
పరిశుభ్రతతో వ్యాధులు దూరం
సిద్దవటం: పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు దూరమవుతాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అఽధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. మండలంలోని పి.కొత్తపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, టక్కోలి ఆరోగ్య ఉపకేంద్రం పరిధిలోని బీసీ కాలనీలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి ఫీవర్‌సర్వే, లార్వా సర్వే చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంటు మలేరియా నివారణ అధికారి జి.వెంకట్‌రెడ్డి, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ ఐ.సుబ్బరాయుడు, పొన్నవోలు పి.హెచ్.సి వైద్యాధికారిణి డాక్టర్ రంగలక్ష్మి, సర్పంచ్ లక్ష్మీదేవి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment