ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి
కడప సెవెన్‌రోడ్స్: పరిశ్రమల స్థాపనతోనే జిల్లా ఆర్థిక ప్రగతి సాధిస్తుందని, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని బోర్డు రూం మీటింగ్ హాలులో జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ(డీఐఈపీసీ) సమీక్షా సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని అనుబంధ శాఖల సమన్వయంతో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావాలన్నారు. పారిశ్రామిక అభివృద్ది పాలసీ(ఐడీపీ)2023–27 ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరికి చెందిన 3 యూనిట్ల పరిశ్రమలకు ఇన్వెస్ట్‌మెంట్ సబ్సిడీ కింద రూ.66.55 లక్షలు, రాయితీ మంజూరుకు కమిటీ ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం చాంద్‌బాషా, ఆర్‌డీఏ పీడీ ఆనంద్ నాయక్, లీడ్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ జనార్థన్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ శ్రీకాంత్ నాయక్, డిక్కీ కో ఆర్డినేటర్ శివశంకర్, అఽధికారులు పాల్గొన్నారు.
నిబంధనల మేరకే ఉచిత ఇసుక
స్థానిక అవసరాల కోసం ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లలో ఇసుక ఉచితంగా తీసుకెళ్లవచ్చని, అయితే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య అవసరాలకు మళ్లిస్తే కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ శ్రీధర్ స్పష్టం చేశారు. మైన్స్ అండ్ జియాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేష్ కుమార్ మీనా ఇసుకపై కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ముగిశాక, కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, కడప ఆర్‌డీవో జాన్ ఇర్విన్, గనులు, భూగర్భ శాఖ డీడీ సూర్య చంద్రరావు, భూగర్భ జల విభాగ అధికారులు, ఇరిగేషన్, పోలీసు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment