అన్నమాచార్యుల సంకీర్తనలు విశ్వవ్యాప్తం చేస్తాం
రాజంపేట: తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనలను విశ్వవ్యాప్తం చేయడానికే ఊరూరా అన్నమయ్య.. ఇంటింటా అన్నమయ్య కార్యక్రమాన్ని అన్నమయ్య వంశీకుల తరఫున నిర్వహిస్తూ వస్తున్నామని అన్నమాచార్య 12వ తరానికి చెందిన వంశీకుడు తాళ్లపాక హరినారాయణస్వామి (తిరుమల) అన్నారు. కార్త్తిక పౌర్ణమిని పురస్కరించుకొని శుక్రవారం అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాకలో ఊరూరా అన్నమయ్య.. ఇంటింటా అన్నమయ్య కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉభయ తెలుగురాష్ట్రాలలో సంకీర్తనల సేవతోపాటు ఆధ్యాత్మిక, సామాజికసేవలను కొనసాగిస్తూ వస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య సేవా ట్రస్ట్ చైర్మన్ తాళ్లపాక రామ్‌చరణ్, వైస్‌చైర్మన్ తాళ్లపాక కృష్ణధీరజ్, సెక్రటరీ తాళ్లపాక గౌరీ ప్రసన్న, ఉభయరాష్ట్రాల డైరక్టర్లుగా కొఠారి సునీత, మీనాక్షి అన్నమయ్యతోపాటు తాళ్లపాకకు చెందిన జవ్వాది అదృష్ట దీపుడు, శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్ సిబ్బంది, అన్నమాచార్య కళాకారులు పాల్గొన్నారు.
108 అడుగుల అన్నమయ్య
విగ్రహం వరకు..
ఊరూరా అన్నమయ్య.. ఇంటింటా అన్నమయ్య కార్యక్రమాన్ని తాళ్లపాక గ్రామ శివార్లలోని శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి హైవేలోని 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వరకు వైభవోపేతంగా నిర్వహించారు. దారిపొడవునా మహిళల కోలాట ప్రదర్శన విశేసంగా ఆకట్టుకుంది. అన్నమయ్య సంకీర్తనలు మారుమోగాయి.
● అన్నమయ్య వంశీకుడు తాళ్లపాక హరినారాయణస్వామి
Comments
Please login to add a commentAdd a comment