కార్తికం... జ్యోతిర్మయం
ప్రొద్దుటూరు కల్చరల్ : శ్రీకృష్ణ గీతాశ్రమంలో కోటి దీపోత్సవం
కార్తిక పౌర్ణమి సందర్భంగా జిల్లా అంతటా దీపాలు ధగధగలాడాయి. అన్ని శివాలయాల్లో సాయం సంధ్యావేళలలో జ్వాలా తోరణాలు కొత్త వెలుగులు పంచాయి. భక్తుల శివనామ స్మరణతో ఆలయాలన్నీ ప్రతిధ్వనించాయి. అన్ని ఆలయాలతో పాటు ప్రత్యేకంగా అటవీ ప్రాంతాల్లోని శైవక్షేత్రాలు, తీర్థాలలో భక్తులు పోటెత్తారు. వైఎస్సార్ జిల్లాలోని ప్రసిద్ధ శివాలయాలైన పుష్పగిరి, పొలతల మల్లేశ్వరుడు, ఖాజీపేట నాగనాథేశ్వరాలయం, మోపూరు భైరవేశ్వరాలయం, ప్రొద్దుటూరు శివాలయాలు, అల్లాడుపల్లె వీరభద్రస్వామి, అనిమెల సంగమేశ్వరాలయం, భానుకోట, కన్నెతీర్థంలతో పాటు అన్నమయ్య జిల్లాలోని అత్తిరాల, రాయచోటి వీరభద్రస్వామి ఆలయం, నిత్యపూజకోన తదితర శివాలయాలలో ఆలయ నిర్వాహకులు, కమిటీ ప్రతినిధులు జ్వాలా తోరణం, కోటి దీపారాధన, లక్ష దీపార్చన తదితర పూజలు నిర్వహించారు. –కడప కల్చరల్
Comments
Please login to add a commentAdd a comment