●జలదిగ్బంధంలో ఆర్టీసీ బస్టాండ్
కడప కోటిరెడ్డి సర్కిల్: కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. చిన్నపాటి వర్షం వచ్చినా.. ఇక్కడ పెద్ద ఎత్తున నీరు నిలవడం పరిపాటిగా మారింది. మూడు రోజుల నుంచి వస్తున్న వర్షాలకు ఆ ప్రాంతం నీటి మడుగులా తయారైంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బస్టాండ్‌లోకి వచ్చిపోయే బస్సులు.. ఈ వర్షపు నీటిలోనే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నీరంతా ఎప్పటికప్పుడు అక్కడి నుంచి వెళ్లేందుకు అధికారులు ఎప్పుడు ప్రయత్నిస్తారోనని ప్రతి సారి ప్రజలు ఎదురు చూడటం తప్ప చేయగలిగిందేమీ లేదు.
Comments
Please login to add a commentAdd a comment