కడప అర్బన్ : జిల్లాలో ప్రజలు పోలీసు శాఖకు ఇచ్చే ఫిర్యాదుల పట్ల సత్వరం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్‌బాబు పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్) కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్‌బాబు ఫిర్యాదుదారులతో ముఖాము ఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణీత సమయంలో వాటిని పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి మృతి
మైదుకూరు : మండలంలోని మిట్టమానుపల్లె వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలకృష్ణ (25) అనే యువకుడు మృతి చెందాడు. ఖాజీపేట మండలం నాగసానిపల్లెకు చెందిన బాలకృష్ణ మరో యువకుడు మోటార్ బైక్‌పై వస్తుండగా మైదుకూరు డిపోకు చెందిన బ్రహ్మంగారిమఠం సర్వీసు బస్సు ఎదురుగా వెళుతోంది. మిట్టమానుపల్లె వద్ద బస్సును తప్పించే ప్రయత్నంలో బైక్‌పై నుంచి ఇరువురు కింద పడినట్టు తెలుస్తోంది. ప్రమాదంలో బాలకృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. బస్సు ను తప్పించే ప్రయత్నంలో బైక్‌ను బస్సు ఢీకొన్నదా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.
జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్)
కె. ప్రకాష్‌బాబు
Comments
Please login to add a commentAdd a comment